AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?

ఎన్నో యుద్ధాల్ని చూసుంటారు. వినుంటారు. లేటెస్ట్‌గా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మన కళ్ల ముందే ఉంది. కానీ, ఎప్పుడైనా పిడకల యుద్ధం చూశారా?

AP: ఒకే గ్రామం.. 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో సమరం.. ఎందుకంటే..?
Pidakala Samaram
Follow us

|

Updated on: Apr 02, 2022 | 6:55 PM

ఎన్నో యుద్ధాల్ని చూసుంటారు. వినుంటారు. లేటెస్ట్‌గా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మన కళ్ల ముందే ఉంది. కానీ, ఎప్పుడైనా పిడకల యుద్ధం చూశారా? ఒకేచోట ఉండేవాళ్లు రెండు శత్రు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం చూశారా? ఈ పిడకల యుద్ధాన్ని చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే. అవును, కర్నూలు జిల్లా(kurnool district)లో ఏటా పిడకల యుద్ధం జరుగుతుంది. ఆలూరు మండలం కైరుప్పల గ్రామంలో ప్రజలు, రెండు వర్గాలు విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. పిడకలే కదా అని లైట్‌ తీసుకోకండి. ఈ పిడకల యుద్ధంలో వందల మంది గాయపడతారు. ఆ రేంజ్‌లో జరుగుతుంది ఈ పిడకల యుద్ధం. ఎన్నో తరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు కైరుప్పల గ్రామస్తులు. అంతేకాదు, ఈ పిడకల సమరం వెనక పెద్ద కథే ఉందంటారు. త్రేతాయుగంలో కాళికా మాతకు, వీరభద్రస్వామి మధ్య జరిగిన ప్రేమ, పెళ్లి గొడవే ఈ పిడకల యుద్ధం అంటారు. ఆనాడు కాళికా మాత, వీరభద్రస్వామి భక్తుల మధ్య జరిగిన పిడకల సమరాన్నే తాము కొనసాగిస్తున్నామని చెబుతున్నారు కైరుప్పల గ్రామస్తులు. ఆదివారం జరగనున్న ఈ పిడకల సమరం కోసం కైరుప్పల గ్రామస్తులు రెడీ అయ్యారు. ఈ పిడకల యుద్ధం తర్వాత కాళికా మాత, వీరభద్రస్వామికి కల్యాణం జరిపిస్తారు. అనంతరం, ఆలయంలో ఉన్న విభూతిని గాయాలకు రాసుకుంటారు గ్రామస్తులు. విభూతి రాసుకుంటే తమ గాయాలు నయం అవుతాయని వాళ్ల నమ్మకం.

Also Read: AP: రాత్రి పూట సైలెంట్‌గా ప్లాన్ చేశారు.. ఊహించని విధంగా చిక్కారు

Hyderabad Metro: మరింత వేగంగా ప్రయాణించనున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లు.. ప్రయాణ సమయం ఆదా

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!