మూడేళ్లు నువ్వు.. మరో మూడేళ్లు నేను.. జపాన్ జంట అగ్రిమెంట్ విషయం తెలిస్తే షాక్ అవడం పక్కా
వైవాహిక బంధం ఎంతో పటిష్ఠమైంది. జీవితంలో వచ్చే సుఖదుఖాలను తట్టుకుని ముందుకు సాగడమే పెళ్లి పరమార్థం. అయితే ఈ విషయంలో కొందరి మధ్య సయోధ్య లోపిస్తుంది. ఫలితంగా వారి కాపురంలో కలహాలు మొదలవుతాయి. ఇక...
వైవాహిక బంధం ఎంతో పటిష్ఠమైంది. జీవితంలో వచ్చే సుఖదుఖాలను తట్టుకుని ముందుకు సాగడమే పెళ్లి పరమార్థం. అయితే ఈ విషయంలో కొందరి మధ్య సయోధ్య లోపిస్తుంది. ఫలితంగా వారి కాపురంలో కలహాలు మొదలవుతాయి. ఇక ముందు కలిసి జీవించలేమని భావించి విడాకులు(Divorce) కోరుకుంటారు. కోర్టును ఆశ్రయించి చట్టప్రకారం డైవర్స్ పొందుతారు. అయితే ఈ కాలంలో చిన్న చిన్న కారణాలకే కొత్త జంటలు డైవర్స్ తీసుకుంటున్నారు. తాజాగా జపాన్(Japan) లో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. పెళ్లి అయితే వధువు ఇంటి పేరు(Sur Name) మారడం సంప్రదాయం. అయితే ఇటీవల ఆ ట్రెండ్ మారుతోంది. కొందరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా తండ్రి ఇంటి పేరునే అలా కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఇందుకు ఉదాహరణ. జపాన్‌కు చెందిన ఆ అమ్మాయి కూడా అలానే చేయాలనుకుంది. ఇదే ప్రేమికుల మధ్య గొడవకు దారితీసింది. ‘మళ్లీ మళ్లీ పెళ్లి’ ఒప్పందానికి కారణమైంది. అసలేం జరిగిందంటే..
జపాన్ లో ఇంటి పేర్లకు సంబంధించి ఓ చట్టం అమలులో ఉంది. పెళ్లయిన భార్యాభర్తలిద్దరికీ ఒకే ఇంటి పేరు ఉండాలనేది ఆ చట్టం సారాంశం. ఈ విషయంలో ఓ జంటకు భేదాభిప్రాయాలు వచ్చాయి. ‘నీ ఇంటి పేరు నేనెందుకు పెట్టుకోవాలి’ అని ఇద్దరూ వాయించుకోవడం ప్రారంభించారు. పెళ్లికి ముందే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య ఈ గొడవ జరిగింది. ఇంటి పేరు కోసం విడిపోవడం ఎందుకని భావించిన ఆ జంట.. చివరకు ఓ ఒప్పందానికి వచ్చారు. మూడేళ్లు వరుడి ఇంటిపేరుతో, మరో మూడేళ్లు వధువు ఇంటిపేరుతో కలిసి ఉండేలా నిర్ణయానికి వచ్చారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం వధువు తన ఇంటి పేరు మార్చుకుంది. 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
ఈసారి భార్య ఇంటి పేరును తన పేరులో చేర్చుకున్నాడు భర్త. 2022 జులైకి మూడేళ్లు పూర్తవుతాయి. అప్పుడు మళ్లీ విడాకులు తీసుకుని, పెళ్లి చేసుకునేందుకు వారు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. తరచూ ఇలా ఇంటి పేర్లు మార్చుకోవడం కాస్త ఇబ్బందికరంగానే ఉందని వారు చెబుతున్నారు. ఉద్యోగ సంబంధిత రికార్డులు అన్నింటిలో తన సొంత ఇంటి పేరే ఉంటుందని, ఇతర ప్రభుత్వ దస్త్రాల్లో మాత్రం తన భార్య ఇంటి పేరు ఉంటుందని ఆ యువకుడు చెప్పాడు.
Also Read