Priyanka Gandhi: “పరీక్షా పే చర్చ” లాగా “పరీక్షా పేపర్ లీక్” పై చర్చ పెట్టండి.. ప్రియాంకా గాంధీ డిమాండ్
ఉత్తరప్రదేశ్ లో జరిగిన పన్నెండో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ(Paper leakage) విషయంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా పే చర్చ లాగా పరీక్షా పేపర్ లీక్...
ఉత్తరప్రదేశ్ లో జరిగిన పన్నెండో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ(Paper leakage) విషయంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా పే చర్చ లాగా పరీక్షా పేపర్ లీక్ అంశంపైనా చర్చ(Discuss) చేపట్టాలని డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్‌లో యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని ఆమె గుర్తు చేశారు. చర్యల పేరుతో గొప్పలు ప్రదర్శించడం తప్ప ఏమీ జరగడం లేదని ఆక్షేపించారు. ఈ విషయం మరిచిపోక ముందే రాష్ట్రంలో మరోసారి పేపర్ లీక్ అయిన ఘటన వెలుగు చూసిందని విమర్శించారు. అంతేకాకుండా పేపర్ లీక్ వార్త రాసిన పాత్రికేయుడ్ని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని బుల్డోజర్లు టార్గెట్ చేయకలేకపోతోందని ఎద్దేవా చేశారు.
యూపీ ప్రభుత్వం(Uttar Pradesh) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ పాలీ ఇంగ్లీష్(English Exam) పరీక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ రద్దు(Exam Cancelled) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పరీక్ష మళ్లీ ఎప్పుడు ఉండబోతోందన్న వివరాలు వీలైనంత త్వరగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. పేపర్ లీక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో యూపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…