కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

దేశంలో కరోనా(Corona) కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూ 1500కు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంపంచంలోని పలు దేశాల్లోనూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే కరోనా కేసుల పెరుగుదల తగ్గినా కొత్త...

కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
Who
Follow us

|

Updated on: Apr 02, 2022 | 8:39 AM

దేశంలో కరోనా(Corona) కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూ 1500కు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంపంచంలోని పలు దేశాల్లోనూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే కరోనా కేసుల పెరుగుదల తగ్గినా కొత్త వేరియంట్లపై(Variants) అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. మ్యుటేషన్‌ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్‌ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటివరకు XD, XE, XF అనే మూడు హైబ్రిడ్‌ రకాలను గుర్తించినట్లు పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌లో 10శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. XD వేరియంట్‌ ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది. XF వేరియంట్‌ను తొలుత యూకేలో గుర్తించారు. జనవరి 19న యూకేలో XE రీకాంబినాంట్‌ గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఈ మూడు హైబ్రిడ్‌ వేరియంట్లలో XE, XF రకాలు మాతృ వైరస్‌ మాదిరిగానే ప్రవర్తించే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్‌ టామ్‌ పీకాక్‌ వెల్లడించారు. XD మాత్రమే కొంత ఆందోళనకరమైనదన్న ఆయన.. ఇప్పటికే జర్మనీ, నెదర్లాండ్‌, డెన్మార్క్‌ దేశాల్లో వెలుగు చూసిందన్నారు.

చాలా దేశాలు కరోనా నిబంధనలను ఎత్తివేయడంతో పాటు పరీక్షలను కూడా తగ్గించినందున ఈ గణాంకాలతో వైరస్‌ అంతమవుతుందని అంచనాకు రాలేమని డబ్ల్యాహెచ్ఓ అభిప్రాయ పడింది. అందువల్ల వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందనేది కచ్చితంగా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వైరస్‌ను తక్కువగా అంచనా వేయొద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

Omicron వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోసులను పెంచాలని అభిప్రాయపడింది. డిసెంబర్ 2021-2022లో ఆరోగ్యవంతమైన వ్యక్తులకు బూస్టర్‌లు అవసరం లేదని WHO పదేపదే నొక్కి చెప్పింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ డిసెంబర్ 2021న బూస్టర్ డోస్‌లు వెయ్యొద్దన్నారు. అయితే మార్చి 8న విడుదల చేసిన ఒక ప్రకటనలో WHO తన నిపుణుల బృందం కోవిడ్-19 వ్యాక్సిన్‌ బుస్టర్ డోస్ కరోనా నుంచి, మరణాల నుంచి రక్షణ కల్పిస్తుందని నిర్ధరించింది.

Also Read

Childhood Pic: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్‌లో మూడు లెజెండ్రీ ఫ్యామిలీ వారసులు.. మీరు గుర్తు పట్టగాలరేమో ట్రై చేయండి..

Crime news: పరీక్షల్లో కాపీ కొడుతున్నాడని.. విద్యార్థి చెయ్యి కొరికిన ఇన్విజిలేటర్

AP News: తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. పట్టాలపై..