Childhood Pic: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్‌లో మూడు లెజెండ్రీ ఫ్యామిలీ వారసులు.. మీరు గుర్తు పట్టగాలరేమో ట్రై చేయండి..

Childhood Pic Viral: సోషల్ మీడియా(Social Media) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలను సెలబ్రెటిల నుంచి సామాన్యుల వరకూ షేర్ చేస్తున్నారు. అయితే తమ అభిమాన నటీనటుల..

Childhood Pic: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్‌లో మూడు లెజెండ్రీ ఫ్యామిలీ వారసులు.. మీరు గుర్తు పట్టగాలరేమో ట్రై చేయండి..
Childhood Photo Viral
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2022 | 8:22 AM

Childhood Pic Viral: సోషల్ మీడియా(Social Media) ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలను సెలబ్రెటిల నుంచి సామాన్యుల వరకూ షేర్ చేస్తున్నారు. అయితే తమ అభిమాన నటీనటుల, క్రీడాకారులకు సంబందించిన పాత విషయాలను, జ్ఞాపకాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సెలబ్రెటీల చిన్ననాటి స్మృతులు అభిమానులను అలరిస్తున్నాయి. తమ చిన్ననాటి ఫోటోలు అంటూ కొన్నింటిని సెలబ్రెటీలు షేర్ చేస్తుండగా, మరి కొన్నింటిని అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా టాలీవుడ్(Tollywood) లో ప్రముఖ ఫ్యామిలీల నుంచి వచ్చిన ముగ్గురు హీరోలు కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగా, దగ్గుబాటి, అల్లు ఫ్యామిలీల హీరోలు చిన్నతనంలో స్కూల్ లో ఉన్న ఫోటోను అభిమానులు షేర్ చెస్తూ సందడి చేస్తున్నారు. మరి మీరు ఆ హీరోలు ఎవరో గుర్తు పట్టగలరేమో ట్రై చేయండి..

రామ్ చరణ్‌, రానాల స్కూల్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతుంది. ఇందులో రామ్ చరణ్‌, రానా ఒకే వరుసలో నిలుచొని ఉండగా, అల్లు శిరీష్ మాత్రం పై వరసలో ఉన్నాడు. చెర్రీ, రానాలు కాస్త గుర్తు పట్టేలా కనిపిస్తున్నప్పటికీ, అల్లు శిరీష్ చాలా బొద్దుగా కనిపిస్తున్నాడు. అయితే రామ్ చరణ్, రానాల కంటే శిరీష్ రెండేళ్ళు చిన్నవాడు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి తొమ్మిదో తరగతి వరకు చెన్నైలోని ఒకే స్కూల్లో చదువుకున్నారు. నిజానికి చిన్నప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతే కాదు, రామ్ భార్య ఉపాసన అదే స్కూల్‌లో జూనియర్, అల్లు అర్జున్ భార్య స్నేహ ఉపాసన క్లాస్‌మేట్.

Childhood Photo Viral 1

Childhood Photo Viral 1

రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు సినిమాకి పరిచయమైనప్పటికీ, తనదైన శైలిలో పాత్రలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో అభిమానులను అలరిస్తున్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటున్నాడు.తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతారామరాజు గా రామ్ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

దగ్గుబాటి వారసుడిగా రానా ఈ ఫోటోలో ఎడమ వైపున కనిపిస్తున్నాడు. లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రానా.. డిఫరెంట్ నేపధ్య సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. బాహుబలి సినిమాతో దేశవిదేశాల్లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాజాగా భీమ్లానాయక్ తో అలరించాడు.

అల్లువారి వారసుడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ లో బాలనటుడిగా అడుగు పెట్టాడు. గౌరవం, కొత్త జంట వంటి సినిమాలో నటించాడు.. కానీ హీరోగా సక్సెస్ అందుకోలేదు.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే .. వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు.

Also Read: Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!