Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం

Bhadrachalam: శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలకు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ముస్తాబైంది. కరోనా(Corona) కారణంగా గత రెండేళ్ల నుంచి వేడుకలను నిరాడంబరంగా...

Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం
Bhadrachalam Sriramanavami
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2022 | 7:36 AM

Bhadrachalam: శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలకు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ముస్తాబైంది. కరోనా(Corona) కారణంగా గత రెండేళ్ల నుంచి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తుండగా.. ఈ సారి భక్తుల మధ్య అత్యంత ఘనంగా ఉత్సవాలు(Celebrations) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి(ఏప్రిల్ 02) నుంచి ఈనెల 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(Brahmotsavam)  ప్రారంభం కానున్నాయి. భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. సేదతీరేందుకు చలువ పందిళ్లు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు.

మొదటి రోజు నూతన సంవత్సర వేడుకలతో తిరువీధి సేవలు ప్రారంభమవుతాయి. ఆరో తేదీన అంకురార్పణ అనంతరం అభిషేకం, ధ్వజపట లేఖనం, ధ్వజపటం ఆవిష్కరణ జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 11న మహా పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. రోజువారి నిత్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు పసుపు రంగులో ఉండగా.. ఏడాదికోసారి నిర్వహించే కల్యాణ మహోత్సవాల్లో మాత్రం ఎరుపు రంగు తలంబ్రాలు ఉంటాయి. బియ్యంలో సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు వడ్లను గోటితో వలిచి సీతారాముల కల్యాణంలో వినియోగించేందుకు భద్రాచలం తీసుకువస్తున్నారు.

వేడుకల కోసం 3 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 175 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేశారు. 60 కౌంటర్లలో వీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఇవి కాకుండా 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి పంపిస్తారు. నేరుగా కౌంటర్లలోనూ విక్రయించనున్నారు.

Also Read: Ugadi 2022: ఉగాది పచ్చడి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు.. తినే ముందు చదువుకోవాల్సిన శ్లోకం ఏమిటంటే