Viral Video: నల్లటి చీకటిలో, తెల్లటి ఆకారం.. భయంతో వణికిపోతున్న జనం..
సోషల్ మీడియా ప్రపంచంలో, ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతాయి. తాజాగా జనాలకు వణుకుపుట్టిస్తోన్న ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. జార్ఖండ్‌లోని....
సోషల్ మీడియా ప్రపంచంలో, ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతాయి. తాజాగా జనాలకు వణుకుపుట్టిస్తోన్న ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. జార్ఖండ్‌లోని ఓ రహదారిపై వింత ఆకారం కనబడటంతో ప్రజల్లో అలజడి చెలరేగింది. దాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. కునుకు తీయడం మానేశారు.. మెతుకు మింగడం మరిచిపోయారు. చిమ్మని చీకట్లో తెల్లని అవతారం.. నదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై నడుస్తూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. జార్ఖండ్ రాష్ట్రం హజారిబాగ్ జిల్లాలో ఈ దృశ్యం కనిపించింది. కట్కమ్సండి-చత్రా రహదారిపై వింత ఆకారం కలకలం రేపింది. రాత్రి వేళ బ్రిడ్జ్‌పై ప్రయాణిస్తోన్న వాహనదారులు ఈ వింత ఆకారాన్ని చూసి హడలెత్తిపోయారు. వారిలో ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశారు. ప్రజలు తమదైన రీతిలో ఈ వీడియో గురించి ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. అది దెయ్యమా ..? లేక గ్రహాంతరవాసి ఇలా వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మాటదేవుడెరుగు. కానీ చీకట్లో కనిపించిన అపరిచిత ఆకారం చూసి భయంతోనే జనం సగం చచ్చిపోతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అది దెయ్యమే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే.. కాదు కాదు.. ఎలియన్ అంటున్నారు మరికొందరు నెటిజన్లు. ఏది ఏమైనా వీడియో మాత్రం నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరు ఓ లుక్ వేసి.. అది ఏంటో చెప్పేయండి.
Also Read: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి.. పూర్తి వివరాలు