Hidden treasures : శంషాబాద్ మండలంలో గుప్తనిధులు.! పూరాతన గుమటంలో తవ్వకాల కలకలం
శంషాబాద్ మండలంలో గుప్తనిధుల కలకలం రేగింది. రెండు కార్లల్లో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల తవ్వకాలు చేసే ప్రయత్నం..

Excavation – hidden treasures: శంషాబాద్ మండలంలో గుప్తనిధుల కలకలం రేగింది. రెండు కార్లల్లో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల తవ్వకాలు చేసే ప్రయత్నం చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు నిలదీయడంతో దుండగులు పరారైపోయారు.

Hidden Tresure 2
ఘటనా స్థలంలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించి తాడు, ఇనుప నిచ్చెన, సుత్తి, పారలు, ఇనుప రాడ్ లు, చేతికి వేసుకునే గ్లౌజ్ లు అక్కడే వదిలేసి లగెత్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడా గ్రామంలోని పురాతన గుమటంలో ఈ ఘటన నెలకొంది.

Hidden Treasures
స్థానికంగా ఉన్న పూరాతన గుమటంలో బంగారు నిధులు ఉన్నాయనే దుండగులు వచ్చి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. నింధితులను పట్టుకుని విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Samshabad
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలంలో లభించిన వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు.
