Diana wedding cake:విచిత్రం… వేలానికి 40 ఏళ్ల క్రితం నాటి కేకు ముక్క.. స్పెషల్ ఏంటంటే..?

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Aug 01, 2021 | 1:29 PM

పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణులుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు...

Diana wedding cake:విచిత్రం... వేలానికి 40 ఏళ్ల క్రితం నాటి కేకు ముక్క.. స్పెషల్ ఏంటంటే..?
Dayana Marriage Cake

Follow us on

పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణులుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్‌ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహం సందర్భంగా 1981 కాలంలో తయారు చేసిన కేక్‌ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్‌ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించి ఉంది. ఈ కేక్‌ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లి ఇంటి సభ్యురాలు మొయిరా స్మిత్‌కు ఇవ్వగా, ఆమె దీన్ని ఓ పూల కేక్‌ టిన్‌లో భద్రపరిచింది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల వివాహ కేక్‌’ అని ఉంది.

త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్‌ ముక్క 300-500 పౌండ్ల ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్‌ ముక్క వేలం పాట సందర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్‌ వింటర్‌ ఔక్షనీర్స్‌ సీనియర్‌ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్‌ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉందన్నారు. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నానని చెప్పారు.

Also Read:  మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. చనిపోయిన ఒడిశా కూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

గుండ్లపోచంపల్లిలో దొంగల బీభత్సం.. గ్యాంగ్ అంతా దిగిపోయింది

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu