CM Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. చనిపోయిన ఒడిశా కూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ప్రమాదవశాత్తు జరిగిన ఏ ఘటనపై అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందన బాధితులకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. వారు...

CM Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. చనిపోయిన ఒడిశా కూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
Cm Jagan
Follow us

|

Updated on: Aug 01, 2021 | 1:14 PM

ప్రమాదవశాత్తు జరిగిన ఏ ఘటనపై అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందన బాధితులకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. వారు మన రాష్ట్రం వారా, పక్క రాష్ట్రం వారా అన్న సంగతి అటుంచి ఫస్ట్ అయితే హెల్ప్‌ చేయాలని ఆదేశిస్తారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రొయ్యల చెరువు యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు వీలైనంత వరకు సహాయ, సహకారాలు అందించాలని స్థానిక నేతలకు సూచించారు. బాధిత కుటుంబాలు ఏ సాయం కోరినా, అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పారు. అటు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సాయంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. సీఎం తమ కష్టాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. బాధితులకు అండగా ఉంటామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ భరోసా ఇచ్చారు. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ సాయం కావాలన్నా చేస్తారని చెప్పారు.

Also Read: Prakasham District: కన్న కొడుకును చంపేందుకు తండ్రి ప్లాన్.. ఎందుకో తెలిస్తే షాక్

 గుండ్లపోచంపల్లిలో దొంగల బీభత్సం.. గ్యాంగ్ అంతా దిగిపోయింది

గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా..?ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే?
గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా..?ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే?
కెప్టెన్లను అందుకుంటున్న తారక్.. టార్చ్ బేరర్ అంటున్న ఫ్యాన్స్
కెప్టెన్లను అందుకుంటున్న తారక్.. టార్చ్ బేరర్ అంటున్న ఫ్యాన్స్
ప్లాస్టిక్ బాక్స్ ఆహారం క్యాన్సర్ సహా ఎన్ని వ్యాధులకు కారకం అంటే
ప్లాస్టిక్ బాక్స్ ఆహారం క్యాన్సర్ సహా ఎన్ని వ్యాధులకు కారకం అంటే
తేలిగ్గా బరువు తగ్గాలా? రోజూ ఓ గ్లాసుడు ఈ పండు జ్యూస్‌ తాగేయండి
తేలిగ్గా బరువు తగ్గాలా? రోజూ ఓ గ్లాసుడు ఈ పండు జ్యూస్‌ తాగేయండి
ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ కమెడియన్
ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ కమెడియన్
పృథ్విరాజ్‌ని గుర్తుచేస్తున్న సూపర్‌స్టార్‌.. ఇంతకీ కథేంటి ??
పృథ్విరాజ్‌ని గుర్తుచేస్తున్న సూపర్‌స్టార్‌.. ఇంతకీ కథేంటి ??
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 30మంది మావోస్టుల హతం
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 30మంది మావోస్టుల హతం
సినిమా ప్లాప్ అయితే హీరోయిన్‏నే తిడతారు.. మాళవిక మోహనన్
సినిమా ప్లాప్ అయితే హీరోయిన్‏నే తిడతారు.. మాళవిక మోహనన్
వార్నీ ఎంతకు తెగించారు.. రైలు ప్రయాణం ఇలా కూడా చేస్తారా.?
వార్నీ ఎంతకు తెగించారు.. రైలు ప్రయాణం ఇలా కూడా చేస్తారా.?
రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లో నగదు జమ..
రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లో నగదు జమ..