Shocking Incident : అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు.. వారిని చూసిన మహిళ ఏం చేసిందంటే..!
Woman Sets Herself On Fire: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ చేసిన ప్రయత్నం చివరికి తన ప్రాణాల మీదకె తెచ్చింది.

Woman Sets Herself On Fire: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ చేసిన ప్రయత్నం చివరికి తన ప్రాణాల మీదకె తెచ్చింది. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని ఒడైకుప్పాని ప్రాంతానికి ఓ కుటుంబం కొన్నేళ్లుగా అక్రమంగా మద్యం వ్యాపారం సాగిస్తోంది. వీరి అక్రమ దందా గురించి తెలుసుకున్న పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు జరిపేందుకు వెళ్లారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన ఇంటి మహిళ.. వారిని భయపెట్టి పంపించాలనుకుంది. ఆ క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించింది. ఆ క్రమంలో సదరు మహిళలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది.
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు మహిళలకు అంటుకున్న మంటలను ఆర్పేశారు. అప్పటికే తీవ్రగాయాలపాలైన బాధితురాలిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. 50శాతం శరీరం కాలినట్లు తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చేప్పలేమని వెల్లడించారు. ఇక మహిళకు అంటుకున్న మంటలను ఆర్పే క్రమంలో పోలీసులు సైతం గాయపడ్డారు. వారికి కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇదిలాఉంటే.. సదరు మహిళ ఇంట్లో 37 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై గతంలోనే పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తాజాగా మరో కేసు కూడా నమోదు చేశారు.
Also read:
రిపబ్లిక్ డే నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్, జర్నలిస్టులపై పోలీసు కేసులు
