Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిపబ్లిక్ డే నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్, జర్నలిస్టులపై పోలీసు కేసులు,

ఈ నెల 26,రిపబ్లిక్ డే నాడు వివాదాస్పద ట్వీట్లు  చేసిన కాంగ్రెస్ నేత శశిథరూర్, మరికొందరు జర్నలిస్టులపై హర్యానాలోని గురుగ్రామ్ లో ఎఫ్ ఐ ఆర్ లు దాఖలయ్యాయి..,

రిపబ్లిక్ డే నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్, జర్నలిస్టులపై పోలీసు కేసులు,
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 4:18 PM

ఈ నెల 26,రిపబ్లిక్ డే నాడు వివాదాస్పద ట్వీట్లు  చేసిన కాంగ్రెస్ నేత శశిథరూర్, మరికొందరు జర్నలిస్టులపై హర్యానాలోని గురుగ్రామ్ లో ఎఫ్ ఐ ఆర్ లు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్టులు రాజ్ దీప్ సర్ దేశాయ్, మృణాల్ పాండే, జాఫర్ ఆగా, పరేష్ నాథ్, వినోద్ కె.జోస్ తదితరులమీద వివిధ సెక్షన్ల కింద గురుగ్రామ్ సైబర్ సెల్ కేసులు పెట్టింది.   గురుగ్రామ్ కు చెందిన మహావీర్ సింగ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వీటిని దాఖలు చేసినట్టు పోలీసువర్గాలు వెల్లడించాయి. యూపీ,   మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విధమైన ఎఫ్ ఐ ఆర్ లు ఇదివరకే పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 న ఢిల్లీలో జరిగిన ఘటనలపై వీరంతా తమ వ్యక్తిగత ట్విట్టర్లలో తప్పుడు, దురుద్దేశపూరితమైన, రెచ్ఛగొట్టే వ్యాఖ్యలు చేశారని మహావీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు ఐపీసీ లోని ఆయా సెక్షన్ల కింద దేశద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలను పోలీసులు  వీరిపై మోపారు.

అయితే దీనిపై స్పందించిన ఎడిటర్స్ గిల్డ్..ఈ వ్యక్తులు తమ వ్యక్తిగత సోషల్ మీడియా సాధనాల్లో ఢిల్లీ ఘటనలపై తమ ఉద్దేశాలను  తెలియజేశారని, ఆయా సంఘటనలకు సంబంధించి అందిన సమాచారాన్ని బట్టి ట్వీట్లు చేశారని పేర్కొంది. జర్నలిస్టిక్ నిబంధనలు, ప్రమాణాల మేరకు కాంగ్రెస్ నేత శశిథరూర్ సహా ఈ జర్నలిస్టులంతా నడుచుకున్నారని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఈ నెల 26 న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లను, ఘర్షణలను కేవలం వార్తా సాధనాలే కాక, వివిధ చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. రిపబ్లిక్ డే పరేడ్ ఓ వైపు ముగుస్తుండగా మరో వైపు రైతులు సింఘు , తిక్రి తదితర బోర్డర్ల నుంచి ఒక్కసారిగా సిటీలోకి దూసుకు వచ్చారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్ప వాయువు కూడా ప్రయోగించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాంటప్పుడు ప్రజలకు సమాచారాన్ని, వీడియోలను  త్వరితంగా చేరవేసేందుకు జర్నలిస్టులకు అనివార్య మైందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. Read Also:రాహుల్ గాంధీలో ఆ క్వాలిటీ లేదు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంచలన వ్యాఖ్యలు. Read Also:తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. చివరి విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడో తెలుసా..