Chennai: లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కిన ప్రయాణికుడు.. ఖాళీ చేయమన్నందుకు మహిళా కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..

ఈ దాడిలో ఆమె ఒంటిపై బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంకావటంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Chennai: లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కిన ప్రయాణికుడు.. ఖాళీ చేయమన్నందుకు మహిళా కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..
Female Rpf Constable
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2022 | 9:37 PM

Chennai: ఆర్‌పిఎఫ్‌కి చెందిన మహిళా కానిస్టేబుల్‌పై లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓ అగంతకుడు దాడి చేశాడు. చెన్నై బీచ్‌ నుంచి చెంగల్‌పట్టు వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్ట్ 23 న చెన్నై బీచ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మహిళా కానిస్టేబుల్‌ డ్యూటీలో ఉండగా ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై జీఆర్పీ విచారణ ప్రారంభించింది.

చెన్నై బీచ్‌లోని లేడీస్ కోచ్ నుండి చెంగల్‌పట్టుకు వెళ్తున్న రైలులో ఎక్కాడు ఓ వ్యక్తి..అతన్ని లేడీస్‌ కోచ్‌ నుండి బయటకు వెళ్లాలని చెప్పింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన లేడీ కానిస్టేబుల్‌ దాంతో తీవ్ర ఆగ్రహానికిలోనైన ప్రయాణికుడు ఆమెపై దాడి చేశాడు. ఆగస్టు 23వ తేదీన ఇద్దరు మహిళా RPF కానిస్టేబుళ్లు రాత్రి 8.30 గంటలకు లోకల్ రైలులో ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్నారు. అంతలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి లేడీస్ కోచ్‌లోకి ప్రవేశించాడు. కంపార్ట్‌మెంట్‌లో ఉన్న అతడిని గమనించిన కానిస్టేబుల్ ఆశీర్వా వెంటనే ఆ వ్యక్తి వద్దకు వచ్చి కోచ్‌ నుంచి దిగాల్సిందిగా కోరారు. అయితే, ఆ వ్యక్తి అకస్మాత్తుగా కానిస్టేబుల్ ఆశీర్వాపై కత్తితో దాడి చేశాడు.

ఈ దాడిలో ఆమె ఒంటిపై బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంకావటంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. GRP చెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్‌కు సమాచారం అందించారు.పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు