Hindupuram: హిందూపురంలో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తే హంతకుడు..!

రెండేళ్ల క్రితం బస్సులో ప్రయాణిస్తూ మహేష్ పరిచయం చేసుకున్నారని సీఐ తెలిపారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ఇద్దరూ చాటింగ్ లు చేసుకునేవారని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా

Hindupuram: హిందూపురంలో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తే హంతకుడు..!
death
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2022 | 7:57 PM

Hindupuram: సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి కలకలం రేపింది. హిందూపురంలోని జి ఆర్ లాడ్జిలో మెడికో పీజీ విద్యార్థిని వివాహిత అక్షిత(25)హత్య జిల్లాలో సంచలం సృష్టిస్తోంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు..తెలంగాణలోని వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా కేంద్రంలోని ఒక వైద్య కళాశాలలో గైనకాలజిస్ట్ చదువుతోంది. మెదక్ జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఇంటీరియల్ డిజైనర్ గా పనిచేస్తున్న మహేష్ వర్మతో కలిసి జి ఆర్ లాడ్జి లో దిగారు. ఈ క్రమంలోనే అక్షిత అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, స్నేహితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

రెండేళ్ల క్రితం బస్సులో ప్రయాణిస్తూ మహేష్ పరిచయం చేసుకున్నారని సీఐ తెలిపారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ఇద్దరూ చాటింగ్ లుచేసుకునేవారని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అక్షిత ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని మహేష్‌ వర్మ బ్లాక్ మెయిల్‌కు దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. చివరకు అక్షిత అశ్లీల ఫోటోలతో బెదిరింపులకు దిగాడు మహేష్. ఈ నెల 23న హైద్రాబాద్ నుండి చిక్బల్లాపూర్ కళాశాలకు ట్రైన్ లో బయలుదేరిన డాక్టర్ అక్షితను ఫాలో అవుతూ.. తాను అదే ట్రైన్ లో వస్తూ హిందూపురం రైల్వే స్టేషన్ లో దిగారు.

ఈ క్రమంలోనే అక్షితను జి ఆర్ లాడ్జికి మహేష్ తీసుకెళ్లినట్టుగా పోలీసులు తెలిపారు. ఇద్దరూ గొడవపడి లాడ్జిలోనే గొంతునులుమి హత్య చేసి,.. తానే 108కు సమాచారం ఇచ్చాడు మహేష్. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు 108 సిబ్బంది. పోలీసులకు సమాచారం వెళ్లడంతో మహేష్ వర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి