Viral News: స్మైల్‌ ప్లీజ్‌.. శవపేటికతో ఫోటో షూట్‌ చేసిన కుటుంబం..! నెటిజన్ల ఫైర్‌.. కారణం మాత్రం ఇదేనట..!

చిరునవ్వుతో ఉన్న ఓ కుటుంబం ఆ శవపేటికతో గ్రూప్ ఫోటో దిగి ఫోటో షూట్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral News: స్మైల్‌ ప్లీజ్‌.. శవపేటికతో ఫోటో షూట్‌ చేసిన కుటుంబం..! నెటిజన్ల ఫైర్‌.. కారణం మాత్రం ఇదేనట..!
Smiling Snap
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2022 | 7:35 PM

Viral News: శవపేటికతో నవ్వుతున్న కుటుంబం గ్రూప్ ఫోటో దిగుతూ.. ఫోటో షూట్ నిర్వహించారు. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరునవ్వుతో ఉన్న ఓ కుటుంబం ఆ శవపేటికతో గ్రూప్ ఫోటో దిగి ఫోటో షూట్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్లాస్ ఫ్రీజర్‌లో ఉంచిన శవానికి కుటుంబ సభ్యులు ముందు, వెనుక వైపుల నుండి చుట్టుముట్టారు. నవ్వుతూ, కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి భిన్నమైన కామెంట్స్‌ని ఎదుర్కొంటున్నాయి. సంతాప ఇంట్లో చిరునవ్వుతో ఫోటో షూట్ ఎలా నిర్వహించాలి? వంటి విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటో కేరళలోని పతనంతిట్టలోని మల్లాపల్లిలో తీసినట్టుగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరియమ్మ అనే 95 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రోజున మరణించింది. ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్‌లో ఉంచి మరుసటి రోజు ఖననం చేశారు. ఆమె అంత్యక్రియలకు ముందు.. కుటుంబ సభ్యులు నవ్వుతూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ విషయాన్ని తమ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. గ్రూప్‌లోని ఈ ఫోటో సోషల్ మీడియాలో చేరటంతో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి కూడా తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేస్తూ ‘చావు అనేది జీవితానికి అంతిమ సత్యం, సంతోషంగా జీవించిన వారికి చిరునవ్వుతో సాగనంపడం కంటే ఆనందం మరొకటి లేదు’ అని రాశారు. ఫోటోకు ఎలాంటి విమర్శలు అవసరం లేదు.

నెటిజన్ల విమర్శనల నేపథ్యంలో.. బంధువులు కూడా స్పందించారు. ‘మరియమ్మ వయసు 95 ఏళ్లు.. ఇప్పటి వరకు కొడుకులు, కూతుళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మనవరాలు, మనవళ్లతో ఎంతో ప్రేమగా జీవించింది. ఏడాది క్రితం అనారోగ్యంతో మంచాన పడిన మరియమ్మతో మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమెతో జరిగిన అనేక సంతోషకరమైన సంఘటనలను గుర్తుచేసుకోవడానికి బంధువులందరితో కలిసి ఈ ఫోటో దిగాము. అంతేకానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే ఉద్దేశ్యంతో మేము ఈ ఫోటో తీయలేదని వృద్ధురాలి బంధువులు స్పందించడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి