Watch Video: యువతిని వేధించాడు.. కట్ చేస్తే అందరి ముందూ చెప్పు దెబ్బలు తిన్నాడు

సాధారణంగా ఓ యువతిని ఎవరైనా వేధిస్తే.. ఆమె కుటుంబ సభ్యులు అతనికి వార్నింగ్ ఇస్తారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ యువతిని వేధించిన వ్యక్తిని ఓ గ్రామపంచాయితీ చెప్పుతో కొట్టలానే తీర్పు ఇచ్చింది. అందరూ చూస్తుండగనే ఆ యువతి అతడ్ని రోడ్డుపై చెప్పుతో కొట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్న యువతిని.. ఓ యువకుడు వేధించసాగాడు. అయితే ఆమె గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది.

Watch Video: యువతిని వేధించాడు.. కట్ చేస్తే అందరి ముందూ చెప్పు దెబ్బలు తిన్నాడు
Woman Beating
Follow us
Aravind B

|

Updated on: Aug 18, 2023 | 5:26 AM

సాధారణంగా ఓ యువతిని ఎవరైనా వేధిస్తే.. ఆమె కుటుంబ సభ్యులు అతనికి వార్నింగ్ ఇస్తారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ యువతిని వేధించిన వ్యక్తిని ఓ గ్రామపంచాయితీ చెప్పుతో కొట్టలానే తీర్పు ఇచ్చింది. అందరూ చూస్తుండగనే ఆ యువతి అతడ్ని రోడ్డుపై చెప్పుతో కొట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్న యువతిని.. ఓ యువకుడు వేధించసాగాడు. అయితే ఆమె గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయాన్ని గ్రామపెద్దలు సీరియస్‌‌గా తీసుకున్నారు. అలా వేధింపులకు గురిచేసినటువంటి యువకుడికి ఆ యువతి చేత చెప్పు దెబ్బలు కొట్టించాలని గ్రామపంచాయితీ వినూత్నంగా తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఆమె అందరూ చూస్తుండనే అతడ్ని చెప్పుతో పలుమార్లు కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఆ వీడియో వైరల్ కావడం వల్ల స్థానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే నెటీజన్లు ఈ వీడియోపై విభిన్నరూపాల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా మరోవైపు ఈ ఏడాది జూన్ నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా అచ్చం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒడిశాలోని బెహ్రాంపూర్‌కు చెందినటువంటి అక్కాచెల్లెళ్లను ఓ వ్యక్తి వేధించాడు. దీంతో ఆ స్కూల్ డ్రెస్‌లో ఉన్నటువంటి ఆ అక్కాచెల్లెళ్లు అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తిని బెల్డుతో చితకబాదారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇలా యువతులను వేధించినవారిపై ఇలా అందిరి ముందు కొట్టడాన్ని చూసి ప్రజలు సమర్థిస్తున్నారు. ఇలా అందరి ముందు వారిపై చర్యలు తీసుకుంటేనే మళ్లీ ఇంకోసారి ఎలాంటి అమ్మాయిని ఎడిపించేందుకు సాహసం చెయ్యరని సూచినస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించి పోలీసులు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం