- Telugu News Photo Gallery Gene edited pig kidney transplanted into brain dead patient, it still working says NYU Langone surgeons
Pig Kidney Transplant: మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు.. నెల రోజులైనా ఇంకా పని చేస్తూనే..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని NYU లాంగోన్‌లోని వైద్యులు బుధవారం పంది కిడ్నీని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి విజయవంతంగా మార్పిడి చేశారు.దీంతో కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు వేసినట్లైంది. బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా.. అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. NYU లాంగోన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ మాట్లాడుతూ.. గ్రహీత యొక్క కిడ్నీ ఒక నెల పాటు సరిగ్గా పని చేసిందని..
Updated on: Aug 17, 2023 | 1:45 PM

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని NYU లాంగోన్‌లోని వైద్యులు బుధవారం పంది కిడ్నీని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి విజయవంతంగా మార్పిడి చేశారు.దీంతో కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు వేసినట్లైంది. బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా.. అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు.

NYU లాంగోన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ మాట్లాడుతూ.. గ్రహీత యొక్క కిడ్నీ ఒక నెల పాటు సరిగ్గా పని చేసిందని.. రెండు నెలల పాటు పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. మానవ కిడ్నీ నిర్వహించే అన్ని ముఖ్యమైన పనులను పంది కిడ్నీ భర్తీ చేస్తుందన్నారు.

పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి పేరు మారిస్ మిల్లర్ (57). మిల్లర్ మెదడుకు కుడివైపున ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పు ఉన్న కణితి ఉన్నట్లు బయటపడంతో వైద్యులు బయాప్సీ చేశారు. కానీ తర్వాత అతను చనిపోయాడు. అతనికి గ్లియోబ్లాస్టోమా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఇది మెదడు క్యాన్సర్.

పంది కిడ్నీ - మానవులకు మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. మానవేతర కణాలను, అవయవాలను మానవులకు మార్పిడి చేసే ప్రక్రియ కొన్ని యేళ్ల నుంచి వైద్యులు ప్రయోగాలు చేస్తున్నారు. గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జన్యుపరంగా మార్పు చెందిన పంది హార్ట్‌ను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. కానీ రెండు నెలల తర్వాత అతనికి అమర్చిన పంది గుండె అకస్మాత్తుగా విఫలమైంది. దీంతో గ్రహీత మరణించాడు.

జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌లో వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అందుకే బతికున్న మనుషులకు జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిలేదు. ఐతే తాజాగా మిల్లర్‌కు అమర్చిన కిడ్నీ వల్ల ఎటువంటి ఇన్‌ఫెక్షన్ అభివృద్ధి చెందలేదక పోవడం విశేషం.





























