- Telugu News Photo Gallery Cinema photos Krithi Shetty new sizzling and glamorous photos goes attractive in social media 17 08 2023 Telugu Actress photos
Krithi Shetty: ఇండస్ట్రీని ఏలుతుందనుకున్నారు.. కానీ అవకాశాలే లేవా.? కృతికి ఏమైంది?
కృతి శెట్టి యూత్ లో పరిచయం అవసరం లేని పేరు.. ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ కళల రాణిగా మారిపోయింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. ఇంక ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తనదైన స్టైల్ ల్లో ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది.
Updated on: Aug 17, 2023 | 2:22 PM

ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది కృతి శెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఈ ముద్దుగుమ్మ భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.

దీంతో కృతికి అవకాశాలు తగ్గాయి. నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు.

వరస ప్లాప్స్ రావడంతో.. కాస్త సైలెంట్ అయిపోయారు.అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుతుందని అంతా అనుకున్నారు కానీ..

ఊహించని విధంగా ఈ బ్యూటీకి బ్యాడ్ లక్ ఎదురైంది. శృతి శెట్టి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చివరిగా వచ్చిన నాగ చైతన్య కస్టడీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

ప్రస్తుతానికి ఈ అమ్మడి చేతిలో అవకాశాలు కనిపించడం లేదనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. సరైన సాలిడ్ హిట్ కోసం కృతి ఎంతగానో ఎదురుచూస్తుంది.





























