TSRTC Bill: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై కొత్త ట్విస్ట్.. గవర్నర్‌ తమిళిసై నిర్ణయం ఏమిటంటే..?

TSRTC Bill: ఆర్టీసీ విలీన బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై న్యాయ సలహా కోరారు. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇతర బిల్లులను కూడా న్యాయశాఖ కార్యదర్శికి పంపారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై తాను చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్‌ తమిళిసై అడిగారు. తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా..? లేదా..? నిర్ధారించాలని కోరారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగానే తదుపరి తీసుకునే చర్యలు ఉంటాయని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆర్టీసీ..

TSRTC Bill: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై కొత్త ట్విస్ట్.. గవర్నర్‌ తమిళిసై నిర్ణయం ఏమిటంటే..?
Governor Tamilisai
Follow us

|

Updated on: Aug 17, 2023 | 9:21 PM

తెలంగాణ, ఆగస్టు 17: ప్రభుత్వంలో తెలంగాణ ఆర్‌టీసీ విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఇప్పటికే శాసన సభ, శాసన మండలి ఏక్రగీవంగా ఆమోదం పలికాయి. అయితే ఆర్టీసీ విలీన బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై న్యాయ సలహా కోరారు. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇతర బిల్లులను కూడా న్యాయశాఖ కార్యదర్శికి పంపారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై తాను చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్‌ తమిళిసై అడిగారు. తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా..? లేదా..? నిర్ధారించాలని కోరారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగానే తదుపరి తీసుకునే చర్యలు ఉంటాయని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్‌ తమిళిసౌ విజ్ఞప్తి చేశారు.

శాసనసభలో టీఎస్ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై అనుమతిస్తూ 10 సిఫార్సులు చేశారు. అవేమిటంటే..

గవర్నర్‌ సిఫార్సు చేసిన 10 సిఫార్సులు:

  1. టీఎస్ఆర్‌టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా రవాణా సంస్థకు చెందిన భూములు, ఆస్తులు దాని యాజమాన్యం చేతిలోనే ఉండాలి. దాని అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మాట తెలపాలి.
  2. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా టీఎస్ఆర్‌టీసీ ఆస్తుల విభజనను పూర్తి చేయాలి.
  3. ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందవల్సిన బకాయిల చెల్లింపు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి.
  4. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పేస్కేల్స్‌, సర్వీస్‌ నిబంధనలు ఉండాలి. వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్‌, గ్రాట్యుటీ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలి.
  5. తీవ్రమైన ఒత్తిడి, శారీరక సమస్యలు, ఆరోగ్యపరమైన కారణాలను చూపుతూ కార్మికులు విజ్ఞప్తి చేసుకొంటే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలి.
  6. టీఎస్ఆర్టీసీలో కఠినంగా ఉన్న క్రమశిక్షణ చర్యలను ప్రభుత్వంలో విలీనం తర్వాత వాటిని సర్వీస్‌ రూల్స్‌ లాగానే మానవీయంగా మార్చాలి.
  7. ప్రభుత్వంలో విలీనం చేసుకొన్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను వేరే శాఖలకు డిప్యూటేషన్‌ మీద పంపితే వారి స్థాయి, జీతం, పదోన్నతులకు పూర్తి రక్షణ కల్పించాలి. పదోన్నతుల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.
  8. కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా జీతాలు, ప్రయోజనాలు కల్పించాలి. వారి సర్వీసుకు పరిరక్షణ, పీఎఫ్‌తో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి.
  9. రెగ్యులర్‌, ఒప్పంద ఉద్యోగులకు సర్వీసులో ఉన్నంత కాలం ఆర్టీసీ ఆసుపత్రుల్లో సేవలు, ప్రభుత్వ ప్రాయోజిత చికిత్సలు, బీమా ప్రయోజనాలను నిర్దిష్ట స్థాయి వరకు ఉమ్మడిగా అందించాలి. రెగ్యులర్‌ ఉద్యోగుల కుటుంబాలనూ ప్రభుత్వ ఆరోగ్య పథకంలో చేర్చాలి.
  10. ఓ స్వతంత్ర సంస్థకు అప్పగించడం లేదా మరేదైనా పద్ధతిలో బస్సుల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వమే చేపట్టాలి. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణకు అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించాలి.