- Telugu News Photo Gallery Cricket photos IND vs IRE: Check out Ireland Cricket Team record in T20s as India aim to continue their winning streak against Irish team
IND vs WI: ఆషామాషీ కాదు, పసికూనలే అనుకుంటే పొరపాటే..! ఒక్క మ్యాచ్ ఓడినా తలదించుకోవాల్సిందే..
IND vs IRE, T20I: ఆసియా కప్ టోర్నీ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీ ప్రారంభానికి ముందే భారత జట్టు ఐర్లాండ్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. రేపటి నుంచి జరిగే ఈ టీ20 సిరీస్‌లో టీమిండియాను సంవత్సరం తర్వాత పునరాగమనం చేస్తున్న జస్ప్రీత్ బూమ్రా నడిపించనున్నాడు. ఈ క్రమంలో భారత్ ముందు ఐర్లాండ్ రికార్డులు, అంతర్జాతీయ టీ2 క్రికెట్‌లో దాని లెక్కల వివరాలను ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 17, 2023 | 8:55 PM

IND vs IRE, T20I: ఆగస్టు 18 నుంచి జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్, ఐర్లాండ్ జట్లు సిద్ధమయ్యాయి. డబ్లిన్‌లోని ది విలేజ్ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

టీమిండియాతో పోలిస్తే ఐర్లాండ్ బలమైన జట్టు కానే కాదు. కానీ ఐర్లాండ్ జట్టులోని లోర్కాన్ టకెట్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టర్, జాషువా లిటిల్ వంటి ఐరీష్ ఆటగాళ్లు బూమ్రా సేనపై పైచేయి సాధించగలరు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఐర్లాండ్ లెక్కలను చూస్తే.. ఐరీష్ జట్టు 2008 నుంచి మొత్తం 152 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఐర్లాండ్ 65 గెలవగా, ఒకటి డ్రా, మరో 7 నో రిజల్ట్. మిగిలిన 79 టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఐర్లాండ్ ఆడిన ఈ 152 మ్యాచ్‌ల్లో భారత్‌తో ఆడిన 5 టీ20లు కూడా ఉన్నాయి. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనే టీమిండియాదే విజయం. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో ఆడే 3 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఏ ఒక్క మ్యాచ్ ఓడినా.. ఐరీష్ టీమ్ రికార్డ్ సృష్టించినట్లే.

2009 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడగా, పటిష్టమైన భారత్ జట్టు ముందు ఐర్లాండ్ చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా 76, 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐర్లాండ్ జట్టు రికార్డ్‌లు స్వదేశంలోనూ పేలవంగానే ఉన్నాయి. సొంతగడ్డపై 43 మ్యాచ్‌లు ఆడిన ఐరీష్ టీమ్ 13 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది, అలాగే 3 మ్యాచ్‌లు డ్రా. అంటే మిగిలిన 27 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ ఓడిపోయింది.





























