Hyderabad: ఆ ముగ్గురిపై కేసులు నమోదు.. పోలీసుల అదుపులో అనంతగిరి అడవుల్లో స్టంట్స్‌ మాస్టర్లు..

CAR RACING: అడ్డంగా రోడ్డు మీదకు వచ్చేయడం.. సినిమాల్లో చేసినట్టుగా స్టంట్స్.. చేసేయడం.. ఇదీ వికారాబాద్ బైక్ రేస్‌లో లేటెస్ట్‌గా బయటకు వస్తున్న అప్డేట్స్. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. గురువారం ఈవెంట్ ఆర్గనైజర్‌ని విచారించబోతున్నారు అధికారులు. వికారాబాద్ అనంతగిరి అడవుల్లో రేసర్లు చేసిన రచ్చపై..

Hyderabad: ఆ ముగ్గురిపై కేసులు నమోదు.. పోలీసుల అదుపులో అనంతగిరి అడవుల్లో స్టంట్స్‌ మాస్టర్లు..
Car Racing
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 17, 2023 | 8:37 PM

లైసెన్స్ ఉండదు.. రూల్స్‌తో సంబంధం లేదు. అడ్డంగా రోడ్డు మీదకు వచ్చేయడం.. సినిమాల్లో చేసినట్టుగా స్టంట్స్.. చేసేయడం.. ఇదీ వికారాబాద్ బైక్ రేస్‌లో లేటెస్ట్‌గా బయటకు వస్తున్న అప్డేట్స్. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈవెంట్ ఆర్గనైజర్‌ని విచారించబోతున్నారు అధికారులు. వికారాబాద్ అనంతగిరి అడవుల్లో రేసర్లు చేసిన రచ్చపై.. ఎంక్వైరీ చేసేకొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైట్ కలర్ బలెనో కార్‌ నడిపిన.. యువకుడికి అసలు లైసెన్సే లేదని గుర్తించారు అధికారులు. ఆ కుర్రాడి తండ్రి పేరుమీదే కారు ఉన్నట్టు గుర్తించారు. లైసెన్స్ లేకుండా కార్ నడపడమే తప్పైతే.. ఏకంగా జీరో కట్స్, స్టంట్స్ చేశాడు. దీంతో ఆ కుర్రాడిపై కేసు నమోదు చేశారు అధికారులు.

ఈవెంట్ ఆర్గనైజర్ అయిన శ్రీమాన్ సన్నీ శుక్రవారం విచారణకు హాజరుకాబోతున్నారు. వికారాబాద్ పోలీసులకూ.. అలాగే అరణ్య భవన్‌లో ఫారెస్ట్ ఆఫీసర్లకి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘటనలో శ్రీమాన్‌నే ప్రధాన నిందితుడిగా చేర్చే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.

వాళ్లు నిర్లక్ష్యంగా ఉండటానికి కారణాలు..

థార్ కారు, బలెనో కారుతో పాటు ఓ బైక్ డ్రైవింగ్ చేసిన వాళ్లపై.. ఐపీసీ సెక్షన్ 336, 279, 290 కింద కేసు ఫైల్ చేశారు అధికారులు. వారిని అధికారులు విచారించారు. ఈ రేసింగ్‌పై విచారణ జరుపుతున్న ఫారెస్ట్ విజిలెన్స్ ఆఫీసర్ రాజారమణారెడ్డి.. బుధవారం స్పాట్‌కి వెళ్లి పరిశీలించారు. ఇంత మంది బైకర్స్ ఉన్నచోట అటవీశాఖ అధికారులు ఎందుకు లేరు. వాళ్లు నిర్లక్ష్యంగా ఉండటానికి కారణాలు ఏంటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

నిర్వాహకుల గుర్తింపుతో..

హైదరాబాద్ నుంచి అనంతగిరి ఫారెస్ట్‌కు వెళ్లిన విజిలెన్స్ ఆఫీసర్స్ టీమ్.. నిర్వాహకుల గుర్తింపుతో పాటు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీస్తోంది. మరోవైపు కొంతమందిని గుర్తించి విచారిస్తున్నారు అధికారులు.

ఫారెస్ట్‌లో రేసర్లు రెచ్చిపోయిన..

ఆగష్టు15 నాడు వికారాబాద్ ఫారెస్ట్‌లో రేసర్లు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 200 బైక్‌లు, 70 కార్లతో రేస్‌లు.. సినిమా తరహా స్టంట్స్‌తో రచ్చరంబోలా చేసి.. స్థానికులతో పాటు పర్యాటకులను భయాందోళనకు గురిచేశారు. అయితే అక్కడికి వెళ్లాక అంతా తన కంట్రోల్ తప్పిపోయిందంటున్నారు రైడ్ ఆర్గనైజర్ శ్రీమాన్ సన్నీ.

రేసింగ్ కోసం పోలీసులు, అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్‌ఐ, సిబ్బందితో ప్రత్యేక సంచార వాహనం అనంతగిరిలో నిత్యం గస్తీ తిరుగుతున్నప్పటికీ మంగళవారం వారు సంఘటనా స్థలానికి గైర్హాజరయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం