Hyderabad: మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం.. 10 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు వారికే కేటాయించాలని సూచన

Hydreabad News: హైదరాబాద్‌లోని మూసినది ఒడ్డున చాలామంది పేదవారు నివసిస్తుంటారు. మురుగు నీటి పక్కనే వారి నివాసాలు ఉండటం వల్ల దర్బర పరిస్థితుల్లో వారు కాలం వెల్లదీస్తుంటారు. అయితే ఇలాంటి వారికోసం రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసినది ఒడ్డున ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నివసించే పేద ప్రజలకు పదివేలకు పైగా డబులు బెడ్ రూం ఇళ్లు అందించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం.. 10 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు వారికే కేటాయించాలని సూచన
Minister KT Ramarao
Follow us
Aravind B

|

Updated on: Aug 18, 2023 | 5:22 AM

హైదరాబాద్‌ న్యూస్, ఆగస్టు18: హైదరాబాద్‌లోని మూసినది ఒడ్డున చాలామంది పేదవారు నివసిస్తుంటారు. మురుగు నీటి పక్కనే వారి నివాసాలు ఉండటం వల్ల దర్బర పరిస్థితుల్లో వారు కాలం వెల్లదీస్తుంటారు. అయితే ఇలాంటి వారికోసం రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసినది ఒడ్డున ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నివసించే పేద ప్రజలకు పదివేలకు పైగా డబులు బెడ్ రూం ఇళ్లు అందించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముసీ నది సమీపంలో ఉన్నటువంటి ఆక్రమణలు సైతం తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత పేదరికం వల్ల మూసినది పక్కనే దుర్భరమైన స్థితిలో జీవిస్తున్నటువంటి వీరందరికి రెండు పడక గదుల ఇళ్లు ఎంతో ఉపశమనం కలిగిస్తాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై మంత్రి విస్తృతంగా చర్చించారు

మరో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం.. భవిష్యత్తు ప్రణాళికలపై చర్యలు తీసుకోవడంతో ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి .. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో వరద నివారణ కోసం ప్రభుత్వం ఇటీవల ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి కేటీర్ తెలిపారు. గతంలో భారీ వర్షాల వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు మునిగిపోతుండేవని అన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా వరద ముప్పు నుంచి తప్పించుకున్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయంటే అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోతుంటాయి. చాలా వరకు ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆ వరద ముప్పు కాస్త తగ్గిందని తెలిపారు.

అలాగే మూసీ నది వెంట వరదకు అడ్డంకిగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగిస్తే్.. ఆ తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్రణాళికలను ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు. ఇక హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాలలో జరిగినటువంటి విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తమ నియోజకవర్గాల్లోని జరిగినటువటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా చేరువయ్యేలా చేయాలని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే రానున్న ఎన్నికల్లో ప్రజలు మద్దతు అడగాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..