AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాత్రిపూట మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. చివరికి

స్వాతంత్రం దినోత్సవం రోజున మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఎల్బీ నగర్ పోలీసులు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను పోలీసు వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‎కి తీసుకెళ్లి మరి పోలీసులు తమ ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు గురిచేసారు. మీర్‎పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ఉంటున్న లక్ష్మి.. తన కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ లోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది.

Hyderabad: రాత్రిపూట మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. చివరికి
Telangana Police
Sravan Kumar B
| Edited By: |

Updated on: Aug 18, 2023 | 5:23 AM

Share

హైదరాబాద్, ఆగస్టు 18: స్వాతంత్రం దినోత్సవం రోజున మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఎల్బీ నగర్ పోలీసులు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను పోలీసు వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‎కి తీసుకెళ్లి మరి పోలీసులు తమ ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు గురిచేసారు. మీర్‎పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ఉంటున్న లక్ష్మి.. తన కూతురు పెళ్లి కోసం ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ లోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. ఆగస్టు 15 మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్ వస్తుండగా.. ఎల్బీనగర్ సర్కిల్లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించి ఆమెను చిత్రహింసలు కి గురిచేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. ఆమె ఎదురు తిరిగితే ని సంగతి చూస్తా అంటూ ఇబ్బందులు గురిచేసారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు తన పరిధిలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అన్నట్టుగానే అంతకుముందు మన్నెగూడలో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ పై దౌర్జన్యం చేసిన మిస్టర్ టీ నిర్వాహకుడు నవీన్ రెడ్డి అంశం తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న చౌహాన్ వెంటనే నవీన్ రెడ్డి పై పీడియాక్ట్ నమోదు చేసి జైలు నుంచి బయటకు రాకుండా చేశారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలిపారు ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో సిపి సిరియస్ అయ్యారు.

అయితే సదరు మహిళను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఎల్‌బీ నగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను కలుగ చేసిన ముగ్గురు మహిళలను 16వ తేదీ తెల్లవారుజామున ఎల్‌బీనగర్ పీఎస్‌కు, పెట్రోలింగ్ పోలీసులు తీసుకెళ్లారు అని అన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ మహిళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెపై పోలీసుల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ విచారణ ఆదేశించి నివేదికను తెప్పించుకుని మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్ మరియు మహిళా కానిస్టేబుల్ సుమలతపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మహిళల పట్ల పోలీసుల ప్రవర్తన పై చట్టం ఏం చెబుతోంది

1. ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ లేకుండా మహిళను సాయంత్రం 6 తరువాత పోలీస్ స్టేషన్ ఆవరణలోకి తీసుకొని రాకూడదు.

2. సాయంత్రం 6 తర్వాత నుంచి ఉదయం 6 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో మహిళల్ని అరెస్టు చేయటానికి వీలు లేదు అత్యంత అవసరమైతే తప్ప.

3. ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ మాత్రమే అరెస్టు చేయాలి.

4. అసలు మహిళలని ఇంటరాగేషన్ కోసం పోలీస్ స్టేషన్ కి పిలవకూడదు ఆఫీసర్ లే మహిళ ఇంటికి వెళ్ళాలి అది కూడా మహిళా పోలీస్ సమక్షంలోనే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం