CTET (July) 2023 Exam: ఆగస్టు 20న సీటెట్-2023 రాత పరీక్ష.. రేపట్నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై-2023 అడ్మిట్‌ కార్డులు ఆగస్టు 18న విడుదల కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఓ ప్రకటనలో వెల్లడించింది. సీటెట్ జులై 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలు నమోదు చేసుకుని అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 20వ తేదీన ఆఫ్‌లైన్‌ విధానంలో రెండు సెషన్లలో సీటెట్‌ పరీక్ష..

CTET (July) 2023 Exam: ఆగస్టు 20న సీటెట్-2023 రాత పరీక్ష.. రేపట్నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్
CTET July 2023 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 17, 2023 | 3:39 PM

హైదరాబాద్‌, ఆగస్టు 17: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై-2023 అడ్మిట్‌ కార్డులు ఆగస్టు 18న విడుదల కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఓ ప్రకటనలో వెల్లడించింది. సీటెట్ జులై 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలు నమోదు చేసుకుని అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆగస్టు 20వ తేదీన ఆఫ్‌లైన్‌ విధానంలో రెండు సెషన్లలో సీటెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

4,545 ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రిలిమ్స్‌ రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) తాజాగా విడుదల చేసింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 4,545 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2వ తేదీల్లో ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ప్రిలిమిన‌రీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఈ పోస్టుల తుది ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించనుంది.

తెలంగాణ గురుకులాల్లో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని కరీంనగర్‌, గౌలిదొడ్డి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) గురుకులాల్లో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆరో తరగతిలో ప్రవేశాలు, బ్యాక్‌లాగ్‌ సీట్లు, తొమ్మిదో తరగతి రెగ్యులర్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫేజ్‌-4 ఫలితాలను ఆగ‌స్టు 16న‌ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ విడుదల చేశారు. మెరిట్‌ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు ఆగ‌స్టు 22వ తేదీలోగా సీట్లు పొందిన ఆయా గురుకులాల్లో ప్రవేశం పొందవల్సి ఉంటుంది. ఈ ఫలితాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత ఎంపిక జాబితాను కూడా గురుకుల సొసైటీ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.