Weather Forecast: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. వచ్చే మూడు రోజులు ఆ ప్రాంతంలో వానలే వానలు..
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక.. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు రెండు రోజలపాటు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ..
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షసూచనను ప్రకటించింది భారత వాతావరణ శాఖ. పలు జిల్లాలను అలెర్ట్ చేసింది. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని తెలిపింది. వాతావరణ వాఖ.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక.. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 16 జిల్లాలకు రెండు రోజలపాటు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరికొన్ని గంటల్లో కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని, శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాలోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని అంటున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక.. వారం రోజులపాటు ఏపీలో వాతావరణం చల్లబడుతుందని చెప్పింది. అల్పపీడన ప్రభావంతో
ఇక.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గుంటురు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. రాజమండ్రిలోనూ భారీ వర్షం దంచికొట్టింది. రోడ్లు జలమయం అయ్యాయి. మొత్తంగా.. భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు మరోసారి తడిసిముద్దవనున్నాయి.
వాతావరణ శాఖ ట్వీట్..
Under the influence of Low Pressure Area over Northwest Bay of Bengal; Intense cloud band moving across coastal Odisha into the interior districts may be seen in Paradip Radar. pic.twitter.com/oyUQrORIG8
— India Meteorological Department (@Indiametdept) August 17, 2023
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..