AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెద్దపల్లిలో గ్యాంగ్ రేప్.. బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రవం.. చికిత్స పొందుతు మృతి

పొట్ట కూటి కోసం మధ్యప్రదేష్ నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందిన బాలికపై పైశాచికత్వానికి ఒడిగట్టారు. అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని మధ్యప్రదేష్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. అప్పన్నపేటకు భవననిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందేందుకు మధ్యప్రదేష్ నుండి కూలీల కుటుంబాలు వలస వచ్చాయి.

Telangana: పెద్దపల్లిలో గ్యాంగ్ రేప్.. బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రవం.. చికిత్స పొందుతు మృతి
Telangana Crime News
G Sampath Kumar
| Edited By: Surya Kala|

Updated on: Aug 18, 2023 | 10:25 AM

Share

మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లాకు ఉపాధి కోసం ఓ కుటుంబ వలస వచ్చింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు.. ఓ మైనర్ అమ్మాయి పై నలుగురు మృగాళ్ల కన్ను పడింది. ఒంటరిగా ఉన్న మధ్యప్రదేశ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేశారు. నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడి గట్టారు. ఎవరికి చెప్పినా చంపుతామని బెదిరించారు. దీంతో స్వగ్రామానికి బయలుదేరారు. తీవ్ర రక్తస్రవంతో మైనర్ బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వలస కార్మికుల కుటుంబానికి చెందిన మైనర్ పై మృగాళ్ల గుంపు అఘాయిత్యానికి ఒడిగట్టింది. పొట్ట కూటి కోసం మధ్యప్రదేష్ నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందిన బాలికపై పైశాచికత్వానికి ఒడిగట్టారు. అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని మధ్యప్రదేష్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. అప్పన్నపేటకు భవననిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందేందుకు మధ్యప్రదేష్ నుండి కూలీల కుటుంబాలు వలస వచ్చాయి. రెండు రోజుల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో నలుగురు వ్యక్తులు 16 ఏళ్ల బాలికను తీసుకెల్లి అత్యాచారానికి ఒడిగట్టడంతో తీవ్ర రక్త స్రావం కావడంతో అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన కూలీలు స్వస్థలానికి  తీసుకెళ్తుండగా  మార్గ మధ్యలో మరణించినట్టు ఆమె బంధువులు తెలిపారు.

అయితే ఆమెపై దారుణానికి ఒడిగట్టిన విషయం బయటికి చెప్తే చంపేస్తామన్నారని బాలిక బంధువులకు వివరించగా ఈ మాటలను వారు రికార్డు చేశారు. పెద్దపల్లి పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడి గట్టిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను పెద్దపల్లికి పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. అప్పనపేట కి వెళ్లి పోలీస్ లు విచారణ చేపట్టారు. ఈ మానవ మృగాళ్ళను ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..