Hyderabad: మెట్రో బ్రిడ్జి పైనుంచి నిర్మించిన మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్.. ఎప్పుడు ప్రారంభం అంటే..?

హైదరాబాద్‎లో జనాభాతో పాటుగా వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల సంఖ్య విస్తృతంగా పెరగడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. గమ్యస్థానానికి సకాలంలో వెళ్లేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సగటు వేగం పెంచడం కోసం కొత్త కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీనికోసం స్ట్రాటజికల్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)కి శ్రీకారం చుట్టారు.

Hyderabad: మెట్రో బ్రిడ్జి పైనుంచి నిర్మించిన మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్.. ఎప్పుడు ప్రారంభం అంటే..?
Flyover
Follow us
Sravan Kumar B

| Edited By: Aravind B

Updated on: Aug 18, 2023 | 5:19 AM

హైదరాబాద్‎లో జనాభాతో పాటుగా వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల సంఖ్య విస్తృతంగా పెరగడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. గమ్యస్థానానికి సకాలంలో వెళ్లేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సగటు వేగం పెంచడం కోసం కొత్త కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీనికోసం స్ట్రాటజికల్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)కి శ్రీకారం చుట్టారు.

SRDP ద్వారా పథకం ద్వారా మొత్తం 45పనులు చేపట్టగా ఇప్పటి వరకు 35 పూర్తి అయ్యాయి. ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి స్టీల్ బ్రిడ్జి 20వ ఫ్లై ఓవర్‎ను ఆగస్ట్ 19న ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు 19 ఫ్లైఓవర్‎లు, 5 అండర్ పాస్‎లు, 7 ఆర్‎ఓ‎బి/ ఆర్‎యుబీలు,1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రోడ్డు వెడల్పు, పనులు పూర్తయ్యాయి. ఇందిరా పార్కు నుండి వీఎస్‎టీ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జితో SRDP ద్వారా ఇప్పటి వరకు 36 పనులు పూర్తి కాగా అందులో ఈ 20 వ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. మిగతా 12 పనులు 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. హైదరాబాద్‎లో SRDP ద్వారా రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్టమొదటి స్టీల్ ఫ్లై ఓవర్ ఇది. మిగితా ఫ్లై ఓవర్‎ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్‎తో ఫ్లై ఓవర్‎ను పూర్తి చేశారు.మొదటిసారిగా మెట్రోబ్రిడ్జి పై నుండి ఫ్లై ఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి గ్రేటర్‎లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది.

ప్రయోజనాలు 1. ఇందిరా పార్కు నుండి వి ఎస్ టి స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. 2. గతంలో లాగా ఆర్‌టీసీ ఎక్స్ రోడ్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ లేకుండా పోతుంది. 3. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. 4. ఇందిరా పార్క్, అశోక్ నగర్,ఆర్‌టీసీ క్రాస్ రోడ్‎లలో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్‎టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత 1.ఇందిరా పార్కు నుండి వీఎస్‎టీ వరకు 2.62 కిలోమీటర్ల పొడవు గల స్టీల్ ఫ్లైఓవర్‎ను చేపట్టారు. 2.అందుకు ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు కాగా అప్ ర్యాంపు 0.106 కి.మీ, డౌన్ ర్యాంపు 0.078 కి.మీ 3. రైట్‎వే 22.20 మీటర్ల నుండి 36.60 మీటర్ల ఎలివేటెడ్ కారిడార్, కుడి వైపు మార్గం 4 లైన్ల బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ (16.60 మీటర్లు)

4. మొత్తం 81 పిల్లర్లు. స్టీల్ ఫ్లై ఓవర్ మొత్తం 2620 మీటర్ల పొడవు, స్టీల్‎తో నిర్మాణం 2437 మీటర్ల పొడవు, స్పాన్ పొడవు 297 మీటర్లు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్