AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నాళలో పడి మృతిచెందిన బాలిక కేసులో అధికారుల నిర్లక్ష్యమే కారణం.. కేసును రీఓపెన్ చేయాలని కోర్టు ఆదేశం

మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని దీన్ దయాల్ నగర్లో 2020 సెప్టెంబర్ 17 న సుమేదా కపూరియా అనే అమ్మాయి నాలాలో పడి చనిపోయింది. మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సుమేధ బాడీని బండ చెరువు వద్ద రికవరీ చేసి.. ఆ తర్వాత సెక్షన్ 304(B) కింద కేసును మార్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే వర్షంలో సైకిల్ తొక్కడానికి బయటకి వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి బాలిక మరణించిందని.. దీనికి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసుని క్లోజ్ చేసారు.

Hyderabad: నాళలో పడి మృతిచెందిన బాలిక కేసులో అధికారుల నిర్లక్ష్యమే కారణం.. కేసును రీఓపెన్ చేయాలని కోర్టు ఆదేశం
Sumedha
Sravan Kumar B
| Edited By: |

Updated on: Aug 18, 2023 | 5:16 AM

Share

హైదరాబాద్ న్యూస్, ఆగస్టు 18: మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని దీన్ దయాల్ నగర్లో 2020 సెప్టెంబర్ 17 న సుమేదా కపూరియా అనే అమ్మాయి నాలాలో పడి చనిపోయింది. మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సుమేధ బాడీని బండ చెరువు వద్ద రికవరీ చేసి.. ఆ తర్వాత సెక్షన్ 304(B) కింద కేసును మార్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే వర్షంలో సైకిల్ తొక్కడానికి బయటకి వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి బాలిక మరణించిందని.. దీనికి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసుని క్లోజ్ చేసారు. అయితే 2020 సెప్టెంబర్ 21న ఈ కేసు పై సుమేధా తల్లి సుకన్య న్యాయ పోరాటానికి దిగింది. సంబంధిత శాఖల నిర్లక్ష్యం కారణంగానే కూతురు సుమేధా చనిపోయిందని ఆమె కోర్టును ఆశ్రయించారు. నాలాలను తెరిచి ఉంచటం, సంబంధిత అధికారులు అక్కడ లేకపోవడం, వర్షాలు తగ్గాక నాళాలను మూసివేసే ప్రయత్నం చెయ్యకపోవడం లాంటి నిర్లక్ష్యలను సుకన్య ఎత్తి చూపారు.

అయితే నాళాలో పడి సుమేధా చనిపోయిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆ నాళాను పైకప్పుతో మూసేశారు. అయితే ఈ కేసును పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. సంవత్సరం పాటు సమయం తీసుకున్న అధికారులు 2021లో కోర్టుకు కొన్ని వేదికను సమర్పించారు. సుమేధ నాళాలో పడి చనిపోయిందనేది నివేదిక సారాంశం. విచారించిన కోర్టు 2023 ఆగస్టులో నివేదికను తప్పు పట్టింది. ఈ కేసును పోలీసులు సరిగా విచారించలేదన్న తల్లిదండ్రుల అభిప్రాయంతో కోర్టు ఏకీభవించింది. సుమేధా తల్లిదండ్రులు ముఖ్యంగా లేవనెత్తిన నాలుగు అంశాలను పరిశీలించిన కోర్ట్ వాటిని సమర్థించింది. ఈ కేసును మరోసారి విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

క్లోజ్ అయిన కేసుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సుమేధ తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. ఎట్టకేలకు సుమారు రెండు సంవత్సరాల పోరాటం తర్వాత కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని మల్కాజిగిరి కోర్టు నేరెడ్‌మెట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తమకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం ఆపమని జి.హెచ్.ఎం.సి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని తల్లితండ్రులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో నాళాల పరిస్థితి చాాలా ప్రాంతాల్లో ఇంకా దారుణంగా ఉంది. ఇటీవల నాళాలో పడి చిన్నారులు మృతి చెందిన సందర్భాలు కూడా వెలుగుచూశాయి. చాలావరకు నాళాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తారని ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరికొందరైతే ఇకనైను నాళాల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం