Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nehru Memorial: నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరు.. మ్యూజియం పేరు మార్పుపై రాహుల్ గాంధీ ఫైర్

PM Museum renaming row: లద్దాఖ్‌లో రెండు రోజుల పర్యటనకు విచ్చేశారు రాహుల్‌గాంధీ. లేహ్‌ ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును మార్చడంపై కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. నెహ్రూ తాను చేసిన కృషితో ప్రసిద్ధి చెందరని .. ఆయన పేరు వల్ల కాదన్నారు రాహుల్‌గాంధీ.

Nehru Memorial: నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరు.. మ్యూజియం పేరు మార్పుపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 17, 2023 | 8:59 PM

ఢిల్లీలో నెహ్రూ మొమోరియల్‌ మ్యూజియం పేరును పీఎం మ్యూజియంపై మార్చడంపై స్పందించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. దేశ రాజకీయ చరిత్ర నుంచి నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరన్నారు. నెహ్రూ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తాను చేసిన మంచిపనులతో నెహ్రూకు గుర్తింపు వచ్చిందని, నెహ్రూ అన్న పేరుతో కాదన్నారు రాహుల్‌.

లద్దాఖ్‌లో రెండు రోజుల పర్యటనకు విచ్చేశారు రాహుల్‌గాంధీ. లేహ్‌ ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును మార్చడంపై కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. నెహ్రూ తాను చేసిన కృషితో ప్రసిద్ధి చెందరని .. ఆయన పేరు వల్ల కాదన్నారు రాహుల్‌గాంధీ. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంకి కొత్తగా ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పేరు పెట్టింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ప్రధాని మోదీకి చాలా భయాలు, అభద్రతా భావాలు ఉన్నాయి. తొలి ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ అజెండాగా పెట్టుకుందని కాంగ్రెస్‌ విమర్శించింది. కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. జవహార్‌లాల్‌ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించిన అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుందని వివరించింది. నెహ్రూ చరిత్ర.. ముఖ్యంగా ఆయన నిర్మించిన భాక్రానంగల్‌ ప్రాజెక్ట్‌ గురించి మ్యూజియంలో సవివరింగా ఉందని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు రాహుల్ లడఖ్‌లో బైక్ యాత్ర కూడా చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ గైర్హాజరు కావడంతో లోక్ సభ ఎన్నికల సన్నాహకానికి సంబంధించి ఈరోజు జరగాల్సిన బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం వాయిదా పడింది.

కార్గిల్ హిల్ కౌన్సిల్ పై అలజడి

వచ్చే నెలలో హిల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్న కార్గిల్ పర్యటనలో రాహుల్ గాంధీ కూడా పర్యటించనున్నారు. దీంతో రాహుల్ పర్యటన అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అక్కడి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. కార్గిల్ హిల్ కౌన్సిల్ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.

పార్లమెంటులో చెప్పారు – నేను లడఖ్ వస్తాను

అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు. ఆ తర్వాత భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ.. కశ్మీర్ వరకు ప్రయాణం గురించి ప్రస్తావించగా, ఆ తర్వాత లడఖ్ ఎంపీ లడఖ్ రావద్దని చెప్పారని, దానికి రాహుల్ గాంధీ త్వరలో వస్తానని బదులిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం