Watch: భారత సైన్యానికి రెక్కలొచ్చాయి.. టెర్రిస్టులు ఎక్కడున్నా తుక్కు తుక్కే..
జెట్‌ప్యాక్ సూట్లు ధరించి.. జవాన్లు జెట్ విమానాల మాదిరిగా గాలిలో ఎగురుతూ టెస్ట్ చేశారు. ముందుగా జెట్‌ప్యాక్ సూట్‌కు సంబంధించి భారత సైన్యం తాజాగా ఓ టెస్ట్ నిర్వహించింది. స్పెషల్ ఫోర్సెస్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఆర్మీ ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్‌లో కొత్త జెట్‌ప్యాక్ సూట్ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్ష చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పారా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది..
భారత ఆర్మీ సైనికులు జెట్‌ప్యాక్ సూట్‌లలో ఎగురుతూ కనిపించారు. జెట్‌ప్యాక్ సూట్లు ధరించి.. జవాన్లు జెట్ విమానాల మాదిరిగా గాలిలో ఎగురుతూ టెస్ట్ చేశారు. ముందుగా జెట్‌ప్యాక్ సూట్‌కు సంబంధించి భారత సైన్యం తాజాగా ఓ టెస్ట్ నిర్వహించింది. స్పెషల్ ఫోర్సెస్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఆర్మీ ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్‌లో కొత్త జెట్‌ప్యాక్ సూట్ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్ష చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పారా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది “ఐరన్ మ్యాన్” మాదిరిగానే జెట్‌ప్యాక్ సూట్‌ను ధరించి.. విజయవంతంగా పరీక్షించారు. మనం ఈ వీడియోలో ఆర్మీ సిబ్బంది అంతా చూస్తుండగా జెట్‌ప్యాక్ సూట్‌ను ధరించిన ఓ కమాండర్ గాలిలోకి దూసుకపోయాడు. ఫుటేజీలో తోటి బృంద సభ్యులు విచారణను గమనిస్తూ.. ఈవెంట్‌ను వారి మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేస్తున్నారు.
సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలలో వ్యూహాత్మక చైతన్యాన్ని పెంచే ప్రయత్నంలో భారత సైన్యం పారా స్పెషల్ ఫోర్సెస్ సూట్లను కొనుగోలు చేసింది. ఆగ్రాలోని ఆర్మీ ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్‌లో జెట్‌ప్యాక్ సూట్ పరీక్షను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికపై షేర్ చేశారు.
ఆర్మీ ప్రయోగాన్ని ఈ వీడియోలో చూడండి..
New jetpack suit is being tested by Para SF at Army Airborne Training School, Agra pic.twitter.com/R6mlDHUvdM
— Indian Aerospace Defence News – IADN (@NewsIADN) August 16, 2023
ట్విటర్‌లో షేర్ చేసిన ప్రదర్శన వీడియోకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. భారత సైన్యం యుద్ధ పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఇది సరైన సమయం అని చాలా మంది అభినందించారు. అయితే కొందరు SFకి ఎత్తైన ప్రదేశాల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాంటివి తప్పనిసరి అంటూ కామెంట్ చేశారు.
బ్రిటీష్ వ్యాపారవేత్త, గ్రావిటీ ఇండస్ట్రీస్ సీఈఓ రిచర్డ్ బ్రౌనింగ్ తన తాజా జెట్‌ప్యాక్ సూట్‌ను ప్రదర్శించారు. ఈ డెమో సూట్ ద్వారా సూపర్ హీరోలా గాలిలో ఎగరడం మొదలుపెట్టారు. ఈ జెట్ ప్యాక్ ఫ్లయింగ్ సూట్ ధరించి 51 కి.మీ. గంట వేగంతో ఎగురుతుంది.
ఎలాంటి సూచనలు ఇచ్చాయో తెలుసుకుందాం. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్ కింద 48 జెట్‌ప్యాక్ సూట్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు భారత సైన్యం తెలిపింది.
జెట్‌ప్యాక్ బరువు 40 కిలోల కంటే తక్కువ ఉండాలనేది షరతు. కానీ అది దాని బరువు కంటే రెండింతలు అంటే 80 కిలోల బరువున్న మనిషితో ఎగురుతుంది. కనీసం ఎనిమిది నిమిషాల పాటు ఎగరగలడు. అలాగే, జెట్‌ప్యాక్‌ను తయారు చేసే కంపెనీ 60 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. మార్కెట్‌లో ఈ సూట్ ధర 3 నుంచి 4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ జెట్‌ప్యాక్ సూట్‌ను ఎంత ధరకు కొనుగోలు చేస్తుందో సైన్యం వెల్లడించలేదు.
సూట్ గ్యాస్ లేదా ద్రవ ఇంధనంతో నడుస్తుంది. ఇది ప్రాథమికంగా టర్బైన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దాని నియంత్రణ కేవలం చేతుల్లోనే ఉంటుంది. దీన్ని ధరించడం వల్ల సైనికులు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు గాలిలో ఎగరవచ్చు. సరిహద్దుల పర్యవేక్షణ, పర్వతాలు, అడవులలో నిఘా జెట్‌ప్యాక్ సూట్ ద్వారా సులభం అవుతుంది. ఇది ధరించి, సైనికులు మాత్రమే ఎగురుతారు. ఎందుకంటే దీన్ని రెండు చేతులతో నియంత్రించాలి.
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో..
జెట్‌ప్యాక్ సూట్ వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లుగా ఉంచాలని భారత సైన్యాన్ని కోరింది. ఈ సూట్ ఏ సీజన్‌లోనైనా పని చేస్తుంది. భారత సైన్యం దీనిని స్వదేశీ కంపెనీ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ సూట్‌లో ఐదు గ్యాస్ టర్బైన్ జెట్ ఇంజన్లు ఉన్నాయి. ఇవి సుమారు 1000 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూట్ జెట్ ఇంధనం, డీజిల్ లేదా కిరోసిన్‌తో కూడా నడుస్తుంది. దానిని ఎగురుతున్న యువకుడు తన చేతుల కదలికతో జెట్‌ప్యాక్ దిశను మార్చగలడు.
ఈ జెట్‌ప్యాక్‌ను ఉపయోగిస్తున్న అమెరికా సైన్యం..
US ఆర్మీ, నేవీ సిబ్బందికి కూడా జెట్‌ప్యాక్ సూట్లలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు దానిని ఉపయోగించడం కూడా నేర్చుకుంటున్నారు. US నావికాదళం దీనిని ప్రత్యేకించి రెస్క్యూ, నిఘా మిషన్ల కోసం ఉపయోగించాలనుకుంటోంది. అలాగే, జెట్‌ప్యాక్ సూట్‌లు నదులను దాటడానికి, లోయలను దాటడానికి, ఎత్తైన ప్రదేశంలో ల్యాండింగ్ చేయడానికి, పర్వతాలను సురక్షితంగా చేరుకోవడానికి లేదా ల్యాండ్‌మైన్‌లపైకి వెళ్లడానికి ఉత్తమ పరికరాలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం