AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Floods: ఇక వరదల సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు.. కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

వర్షకాలం వచ్చిందంటే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరదలు వస్తూనే ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఇళ్లు ధ్వంసం అయిపోతాయి. ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. అయితే ఈ వరద బీభత్స ఘటనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర జల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఫ్లడ్‌వాచ్ పేరుతో ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ యాప్ ఉపయోగించడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

Floods: ఇక వరదల సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు.. కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Floods
Aravind B
|

Updated on: Aug 18, 2023 | 5:12 AM

Share

వర్షకాలం వచ్చిందంటే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరదలు వస్తూనే ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఇళ్లు ధ్వంసం అయిపోతాయి. ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. అయితే ఈ వరద బీభత్స ఘటనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర జల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఫ్లడ్‌వాచ్ పేరుతో ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ యాప్ ఉపయోగించడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే దేశంలో ఎక్కడ కూడా వరదలు వచ్చినా.. ప్రభావిత ప్రాంతాల్లో రియల్ టైమ్ సమాచారం ఇందులో ప్రత్యక్షమవుతుంది. దాదాపు 338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని సైతం ఈ యాప్ క్రోడీకరిస్తుంది. ఈ యాప్ వినియోగించడం వల్ల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుందని కేంద్ర జల శక్తి ఛైర్‌పర్సన్ కుశ్వీందర్ వొహ్రో పేర్కొన్నారు.

మరో విషయం ఏంటంటే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఎక్కువగా వరదలు వస్తుంటాయి. అయితే ఈ ప్రాంతాలకు మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తుందని.. తద్వారా అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ యాప్ రూపకల్పన వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశమని వోహ్రో పేర్కొన్నారు. అలాగే ఏడు రోజుల వరకు కూడా ఈ యాప్‌లో సూచనలు కనిపిస్తాయని చెప్పారు. శాటిలైట్, డేటా విశ్లేషణ, గణాంకాల నమూనా, రియల్ టైమ్ సమాచారాన్ని ఉపయోగించుకునే అధునాతన సాంకేతికతను సైతం ఈ యాప్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. వీటివల్ల సకాలంలోనే కచ్చితమైన అంచనాలను ప్రజలకు తెలుస్తాయని వివరించారు. మరో విషయం ఏంటంటే ఫ్లడ్‌వాచ్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ సేవలను ఎవరైనా కూడా సలుభంగా ఉపయోగించుకోవచ్చని కుశ్వీందర్ వొహ్రో పేర్కొన్నారు.

వరదలు వచ్చే సమయంలో.. ఆడియో, టెక్ట్స్ రూపంలో ప్రజలకు సరైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా చేరవేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఈ సేవలను పొందుపరిచామని తెలిపారు. అలాగే త్వరలోనే దేశంలోని అన్ని స్థానిక భాషలను జత చేస్తామని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే వరద ముప్పులతో అసవస్థలు, ఇబ్బందులు పడుతున్నటువంటి హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్లడ్‎వాచ్ యాప్ సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకా ఆరు నెలల సమయం పుడుతుందని వోహ్రో పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే దేశంలో ఎక్కడెక్కడ వరదలు వచ్చాయో కూడా ఇండియా మ్యాప్‌పై కనిపిస్తుంది. రాష్ట్రాల పేరు మీద ఆధారంగా శోధించి సంబంధిత వరద సమాచారం తెలుసుకోవచ్చు. అయితే కేంద్ర జల సంఘం తీసుకొచ్చినటువంటి ఈ యాప్‌‌ను చాలా మంది ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం