Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: జట్టులో కోహ్లీ లేకుంటే ‘ప్రపంచకప్’ కష్టమే.. తేల్చి చెప్పేసిన టీమిండియా మాజీ కోచ్..

Virat Kohli: విరాట్ విషయానికొస్తే ఒక్క చెత్తో ఆటను మలుపు తిప్పగల ఒకే ఒక్క ఆటగాడు అతను. 2020 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌పై అతను ఆడిన ఆట ఏ ఒక్కరూ మర్చిపోలేరు. అయితే కోహ్లీ ఇప్పుడు టెస్ట్, వన్డే క్రికెట్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ టీ20 ఫార్మాట్‌లో పరిమితంగా ఆడుతున్నాడు. రానున్న వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్‌కి పనిభారం తగ్గించేందుకే అతన్ని టీ20 ఫార్మాట్‌కి బీసీసీఐ దూరంగా ఉంచినట్లు సమాచారం. అయితే  పనిభారాన్ని అదుపు చేసేందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ విరాట్‌ను..

Team India: జట్టులో కోహ్లీ లేకుంటే ‘ప్రపంచకప్’ కష్టమే.. తేల్చి చెప్పేసిన టీమిండియా మాజీ కోచ్..
Virat Kohli
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 17, 2023 | 5:46 PM

Virat Kohli, Team India: భారత క్రికెట్ జట్టులో ఇప్పుడున్న ఆటగాళ్లంతా పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లే. దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆడినందుకు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ఫలితం ఎలా ఉందో మనందరికీ తెలుసు. అంటే ఇంకొంత కాలం పాటు రోహిత్, కోహ్లీ అవసరం జట్టుకు ఎంతగానో ఉంది. ముఖ్యంగా విరాట్ విషయానికొస్తే ఒక్క చెత్తో ఆటను మలుపు తిప్పగల ఒకే ఒక్క ఆటగాడు అతను. 2020 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌పై అతను ఆడిన ఆట ఏ ఒక్కరూ మర్చిపోలేరు. అయితే కోహ్లీ ఇప్పుడు టెస్ట్, వన్డే క్రికెట్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ టీ20 ఫార్మాట్‌లో పరిమితంగా ఆడుతున్నాడు. రానున్న వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్‌కి పనిభారం తగ్గించేందుకే అతన్ని టీ20 ఫార్మాట్‌కి బీసీసీఐ దూరంగా ఉంచినట్లు సమాచారం.

అయితే  పనిభారాన్ని అదుపు చేసేందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ విరాట్‌ను టీ20 క్రికెట్‌కు దూరంగా ఉంచినట్లు సమాచారం. 2024 టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ ఆడతాడా, లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇదే ప్రశ్నపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్.. కోహ్లీ లేకపోతే భారత్‌కి నష్టమేనని తేల్చిచెప్పాడు. సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం, నైపుణ్యం, ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం కారణంగా 2024 ప్రపంచ టీ20 జట్టులో అతను లేకపోతే బీసీసీఐ తప్పు చేసినట్లే. విరాట్ ఖచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి, కోహ్లీ లేని భారత జట్టు గురించి ఆలోచించలేం. గత టీ20 ప్రపంచకప్‌లో అతను ఎలా రాణించాడో గుర్తుందా..? పాకిస్తాన్ లాంటి జట్టులతో ఆడేటప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కొన్నిసార్లు తలెత్తుతాయి. ఫలితంగా చిన్న పొరపాటుకు కూడా భారీ జరిమానాకు దారి తీస్తుంది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో క్రీజులో విరాట్ లాంటి అనుభవజ్ఞుడైన మ్యాచ్ విన్నర్ కావాలి, అలాంటివారు లేకపోతే కష్టమే’ అని బంగర్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

కోహ్లీ ఓ లెజెండ్: సంజయ్ బంగర

కోహ్లీ ఉండి తీరాల్సిందే..

పాక్‌పై కోహ్లీ విధ్వంసం.. 

కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి అభిమానులకు కూడా కన్నీళ్లే.. 

భారీ షాట్ల వర్షం

2 minutes of aesthetic shots from Virat kohlipic.twitter.com/DjCS422SEw

— M. (@IconicKohIi) August 9, 2023

ఇంకా మాట్లాడుతూ ‘భారీ షాట్లు కొట్టగలిగేవారంతా మ్యాచ్‌ని గెలవలేరు, అదే నిజమైన వెస్టిండీస్ జట్టు అన్ని మ్యాచ్‌ల్లో గెలుస్తుంది. కానీ కోహ్లీకి సిక్సర్ కొట్టకుండానే సెంచరీ చేయగల సామర్థ్యం ఉంది. గుజరాత్ టైటాన్స్‌పై సిక్సర్ కొట్టకుండానే సెంచరీ చేసి చూపించాడు కోహ్లీ. ఇంకా కోహ్లీ తన కంటే అనుభవజ్ఞులైన వారి నుంచి స్ఫూర్తి పొందాడు. ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టును ఓడించిన ఘనత అతనిద’ని బంగర్ చెప్పుకొచ్చాడు.