Pakistan: దిగొచ్చిన పాక్ బోర్డ్.. కొత్త వీడియోలో ‘కెప్టెన్’కి స్థానం.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Pakistan Cricket: పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ లేకుండా పీసీబీ వీడియో షేర్ చేయగా.. దానిపై #ShameOnPCB అంటూ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపట్టారు. ఈ క్రమంలోనే వసీమ్ అక్రమ్ కూడా పాక్ బోర్డ్ వెంటనే ఇమ్రాన్ ఖాన్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తోషాఖానా’ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌కి ఈ వీడియోలో స్థానం లేకపోవడం వెనుక పాక్ ప్రభుత్వ హస్తం కూడా ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ దిగొచ్చి, కొత్త వీడియోను షేర్ చేసింది. దీనిపై పలువురు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం..

Pakistan: దిగొచ్చిన పాక్ బోర్డ్.. కొత్త వీడియోలో ‘కెప్టెన్’కి స్థానం.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Imran Khan in PCB's New Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 17, 2023 | 4:23 PM

పాకిస్తాన్ స్వాతంత్య్రం సందర్భంగా పాక్ క్రికెట్ బోర్డ్ ఆగస్టు 14న పోస్ట్ చేసిన వీడియో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జట్టును 1992 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిపిన పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ లేకుండా పీసీబీ వీడియో షేర్ చేయగా.. దానిపై #ShameOnPCB అంటూ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపట్టారు. ఈ క్రమంలోనే వసీమ్ అక్రమ్ కూడా పాక్ బోర్డ్ వెంటనే ఇమ్రాన్ ఖాన్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తోషాఖానా’ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌కి ఈ వీడియోలో స్థానం లేకపోవడం వెనుక పాక్ ప్రభుత్వ హస్తం కూడా ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ దిగొచ్చి, కొత్త వీడియోను షేర్ చేసింది. దీనిపై పలువురు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాక్ క్రికెట్ బోర్డ్ కొత్త వీడియోను గురువారం ఉదయాన్నే షేర్ చేస్తూ ‘PCB 2023 ప్రపంచ కప్ కోసం తన క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ఆగస్టు 14న అప్‌లోడ్ చేసిన వీడియో నిడివి ఎక్కువగా ఉన్నందున కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మిస్ అయ్యాయి. వాటిని రెక్టీఫై చేసిన తర్వాత పూర్తి వెర్షన్‌ వీడియో ఇదిగో’ అన్నట్లుగా క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అతని కంటే గొప్ప క్రికెటర్ పాకిస్తాన్‌లో లేడు.. 

పవర్ ఆఫ్ ఖాన్..

గ్రేట్ మూమెంట్.. 

నేషనల్ హీరో..

కాగా, ఆగస్టు 14న పీసీబీ షేర్ చేసిన వీడియోలో ఇమ్రాన్ ఖాన్ లేడు. దీంతో వీడియోపై స్పందించిన రావల్పిండి ఎక్సె‌ప్రెస్ వసీమ్ అక్రమ్ ‘రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ క్రికెట్‌కి ఐకాన్. అతని సారథ్యంలోనే పాకిస్తాన్ శక్తివంతమైన క్రికెట్ జట్టుగా అభివృద్ధి చెందింది. అతను మాకు మార్గం చూపించాడు. పీసీబీ వీడియోను తొలగించి, వెంటనే ఇమ్రాన్‌కి క్షమాపణలు చెప్పాల’ని డిమాండ్ చేశాడు. అలాగే పలువురు నెటిజన్లు కూడా ఇదే తరహాలో డిమాండ్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..