- Telugu News Photo Gallery IRCTC's latest Package for Andaman tour from Hyderabad, check here to know full details
IRCTC Andaman Tour: హైదరాబాద్ టు అండమాన్.. ప్రకృతి ఒడిలో 6 రోజుల ట్రిప్.. అందుబాటు ధరలోనే..
IRCTC Tour Package: వర్షాకాలంలోని ఆహ్లదకర వాతావరణాన్ని పర్యటక ప్రదేశాల్లో గడపాలనుకునేవారికి శుభవార్త. దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకెజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి అండమాన్ దీవులకు ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకెజీని ప్రకటించింది. దాదాపు 3 వందల ద్వీపాలు, అందమైన బీచ్‌ల మధ్య సాగే ఈ పర్యటన ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మరి ఈ హైదరాబాద్- అండమాన్ టూర్ ప్యాకెజీ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 17, 2023 | 2:40 PM

IRCTC Tour Package: ఆగస్టు నెలలో ఇసుక తిన్నెలపై నడుస్తూ ప్రకృతి వడిలో సమయాన్ని గడపాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ హైదరాబాద్- అండమాన్ టూర్ ప్యాకెజీని ప్రకటించింది. Amazing Andaman EX Hyderabad పేరుతో ఈ నెల 18న ప్రారంభమయ్యే టూర్ మొత్తం 6 రోజుల పాటు సాగుతుంది. ఈ 6 రోజుల అండమాన్ టూర్‌లో భాగంగా మీరు హావలాక్, పోర్ట్ బ్లెయిర్ సహా అండమాన్ దీవుల్లోని ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.

ఈ టూర్ కోసం మీరు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ముందుగా ఆగస్టు 18న ఉదయం 4: 35 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి, 9:15 గంటల సమయానికి పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో విడిది చేసి తర్వాత సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు.

అక్కడ మీరు లైట్, సౌండ్ షోను తిలకించవచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రికి డిన్నర్, స్టేయింగ్ ఉంటుంది. అనంతరం రెండో రోజు నార్త్ బే ఐలాండ్‌లో పర్యటిస్తారు. మూడో రోజు హావలాక్ టూర్‌లో భాగంగా కలాపత్తార్, రాధానగర్ బీచ్‌లను సందర్శించి అక్కడే స్టే చేస్తారు. నాల్గో రోజు హావలాక్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి, భరత పూర్ బీచ్, లక్ష్మాపూర్ బీచ్‌ల సందర్శనకు వెళ్తారు.

ఐదో రోజు ఉదయం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కి చేరుకుంటారు. తర్వాత రెస్ట్, షాపింగ్ కోసం సమయం ఉంటుంది. ఆ రోజు అక్కడే స్టే చేస్తారు. అలాగే ఆరో ఉదయం 7:55 గంటలకు విమానం ద్వారా మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

Amazing Andaman EX Hyderabad టూర్ ప్యాకేజీ ధరలు విషయానికొస్తే సింగిల్ అక్యూపెన్సీ ధర రూ. 58440 కాగా, డబుల్ అక్యూపెన్సీ ధర రూ.45830. అలాగే త్రిపుల్ అక్యూపెన్సీ అయితే రూ.45540. ఈ ప్యాకెజీలోనే హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి కవల్ అవుతాయి. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వేరే ధరలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీరు https://www.irctctourism.com అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.





























