AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: సోమవారం నుంచి ప్రధాని మోదీ యూరప్‌ టూర్‌.. జర్మనీ నుంచే తొలి పర్యటన..

ఓవైపు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకయుద్ధం జరుగుతున్న వేళ సోమవారం నుంచి ప్రధాని మోదీ యూరప్‌ పర్యటనకు వెళ్తున్నారు. డెన్మార్క్‌ , ఫ్రాన్స్‌ , జర్మనీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు.

PM Narendra Modi: సోమవారం నుంచి ప్రధాని మోదీ యూరప్‌ టూర్‌.. జర్మనీ నుంచే తొలి పర్యటన..
Pm Modi
Sanjay Kasula
|

Updated on: May 01, 2022 | 8:37 PM

Share

ఓవైపు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకయుద్ధం జరుగుతున్న వేళ సోమవారం నుంచి ప్రధాని మోదీ యూరప్‌ పర్యటనకు వెళ్తున్నారు. డెన్మార్క్‌ , ఫ్రాన్స్‌ , జర్మనీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. కరోనా విజృంభణ తరువాత రెండేళ్లలో తొలిసారి విదేశాల్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. సోమవారం నుంచి మోదీ మూడు రోజుల ఫారెన్‌ టూర్‌ ప్రారంభమవుతుంది. ఉక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్దం జరుగుతున్న వేళ మోదీ యూరప్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని.. తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్‌ చేరుకుంటారు. మూడు దేశాల్లో దాదాపు 65గంటల పాటు గడపనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. డెన్మార్క్‌, జర్మనీలలో ఒక రాత్రి చొప్పున బస చేయనున్నారు.

ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రాకవేత్తలతో సమావేశం అవుతారు మోదీ . యూరప్‌ పర్యటనలో 25 సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. పలువురు ప్రపంచ నేతలతో భేటీలో ద్వైపాక్షిక, అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమవుతారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. ‘జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్స్‌తో బెర్లిన్‌లో మోదీ భేటీ అవుతారు. భారత్‌-జర్మనీ ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. షోల్స్‌తో మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్‌ నిర్వహిస్తున్న సదస్సులోనూ మోదీ పాల్గొంటారు.

ప్రధాని మోదీ సోమవారం నుంచి మూడు దేశాల పర్యటన

డెన్మార్క్‌ సదస్సులో భాగంగా ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానులతో మోదీ సమావేశమవుతారు. . కరోనా అనంతర ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నవకల్పనలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీల్లో చర్చకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి: TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..

Students Fighting: విద్యార్థులా..! వీధి రౌడీలా..! కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..