TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..

ఓయూ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓయూ అడ్మినిస్ట్రేషన్‌ భవనాన్ని విద్యార్ధులు ధ్వంసం చేశారు. అద్దాలు పగులకొట్టి ఎన్‌ఎస్‌యూఐ నేతలు లోపలకు వెళ్లారు.

TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..
Rahul
Follow us

|

Updated on: May 01, 2022 | 4:35 PM

ఉస్మానియా రణ రంగంగా మారింది. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్(Congress) విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ (NSUI) కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓయూ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓయూ అడ్మినిస్ట్రేషన్‌ భవనాన్ని విద్యార్ధులు ధ్వంసం చేశారు. అద్దాలు పగులకొట్టి ఎన్‌ఎస్‌యూఐ నేతలు లోపలకు వెళ్లారు. వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టారు. ఓయూ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నించిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఉదయం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. నాయకుల పరామర్శకు పీఎస్‌కు వెళ్లిన జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓయూలో రాహుల్ సభ నిర్వహణపై కండీషన్స్‌ అప్లయ్ అంటోంది టీఆర్‌ఎస్‌. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాకే క్యాంపస్‌లో అడుగుపెట్టాలని అల్టిమేటమ్‌ ఇచ్చింది. రాష్ట్రం ఇచ్చిన రాహుల్ వస్తే అడ్డుకోవడమేంటని తెలంగాణ కాంగ్రెస్‌ కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతోంది. ఫైనల్‌గా ఒకే ఒక్క టూర్‌ రెండు పార్టీల మధ్య వార్‌గా మారిపోయింది.

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. అలాంటిది రాహుల్‌ను రావొద్దంటే ఎలా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు. ఇలాంటి వాతావరణం సృష్టించడం సరికాదన్నారు. రైఫిల్ రెడ్డి పిలవగానే రాహుల్‌ రావడం విడ్డూరంగా ఉందన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

రాహుల్ సభ పొలిటికల్ ప్రకంపనలు పుట్టిస్తోంది. అటు క్యాంపస్‌లోనూ సేమ్ సిట్యువేషన్‌ కనిపిస్తోంది. గతంలో జరగని రాజకీయ సభలు ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు టీఆర్‌ఎస్‌వీ నేతలు. రాహుల్‌ సభకు అనుమతివ్వకుంటే ప్రగతిభవన్‌తో పాటు మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి: Telangana: పోలీసు ఉద్యోగ అభ్యర్థులు అలర్ట్‌.. తస్మాత్‌ జాగ్రత్త.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే