AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Students Fighting: విద్యార్థులా..! వీధి రౌడీలా..! కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..

వీధి రౌడీలను మించిపోయారు ఆ విద్యార్థులు. నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఇది జరిగింది పక్క రాష్ట్రం తమిళనాడులో కాదు మన తెలంగాణలోనే..

Students Fighting: విద్యార్థులా..! వీధి రౌడీలా..! కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..
Clashes Between Senior And
Sanjay Kasula
|

Updated on: May 01, 2022 | 5:05 PM

Share

వీధి రౌడీలను మించిపోయారు ఆ విద్యార్థులు. నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఇది జరిగింది పక్క రాష్ట్రం తమిళనాడులో కాదు మన తెలంగాణలోనే..  ఖమ్మం జిల్లాలో అబ్బాయిలు కొట్టకున్నారు. అట్ల, ఇట్ల కాదు.. దుమ్మురేగిపోయింది. చేతికి ఏది దొరికితే దానితో విరుచుకుపడ్డారు. ఎదుటివాడు సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా విరుచుకుపడ్డారు. కొట్టుకున్నది కూడా ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ వీడియో తెగ సందడి చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే విచక్షణారహితంగా బజారునపడి పోట్లాడుకున్నారు. ఖమ్మం జిల్లా(Khammam district) సత్తుపల్లి(Sathupalli) మండలం గంగారాంలో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జూనియర్ విద్యార్థి బర్త్ డే వేడుకలు నిర్వహించారు స్నేహితులు. ఈ వేడుకలో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థులను కామెంట్ చేశాడని గొడవ మొదలైంది. ఇది జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకొన్నారు. దీనిపై సత్తుపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో సీనియర్‌, జూనియర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఘర్షణకు కారణం జూనియర్‌ విద్యార్థి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మొదలైన గొడవ. ఆ సెలబ్రేషన్స్‌ కూడా విపరీతంగానే ఉన్నాయి. బర్త్‌డే విద్యార్థిని రోడ్డుపై పడేస ఈడ్చేశారు ఫ్రెండ్స్‌. చేతికి దొరికిన సున్నం పోసి మరీ చితక బాదారు. ఆ తర్వాత కొబ్బరి మట్టలతో కొట్టారు. ఇలా జరిగిన ఘటనపై నెమ్మదిగా పోలీసులకు చేరడంతో సత్తుపల్లి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కొట్టుకున్న విద్యార్థులను గుర్తించేపనిలో పడ్డారు.

ఇదిలావుంటే.. మన పక్క రాష్ట్రం తమిళనాడులో నిత్యం తన్నుకుంటున్నారు విద్యార్థులు. కోవిడ్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కాలేజీల్లో గొడవలు జరగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. తాజాగా మదురైలో బస్టాండ్‌లో అందరూ చూస్తుండగా స్కూల్‌ విద్యార్థినులు కొట్టుకున్నారు. ఒకర్నొకరు కింద పడేసి కాళ్లతో తన్నుకున్నారు. ఓ యువకుడిని ప్రేమించే వ్యవహారంపై వారి మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థినులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకరినొకరు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్