What India Thinks Today: ‘4 ఏళ్లు సైన్యంలో పనిచేస్తే.. జీవితమంతా క్రమశిక్షణతోనే’: కేంద్ర జలశక్తి మంత్రి
భారత్ కూడా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని షెకావత్ ఈ సందర్భంగా వెల్లడించారు. "రెండు-మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాం. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వేగంగా పురోగమిస్తున్నాం.
What India Thinks Today: ఆర్మీలో నాలుగేళ్లపాటు సేవలందించిన వారి జీవితమంతా క్రమశిక్షణతో సాగుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అగ్నిపథ్ స్మీమ్‌పై భారీ నిరసనలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. TV9 నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో షెకావత్ మాట్లాడుతూ, అగ్నిపథ్ ప్రాముఖ్యతను, సైన్యంలో సేవ చేయడం ఒకరి జీవితాన్ని ఎలా మారుస్తుందో చాలా వివరంగా తేల్చి చెప్పారు. ‘‘ఈ పథకంపై కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యువత దీన్ని అర్థం చేసుకుని అలవాటు పడతారని నేను నమ్ముతున్నాను. నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసిన యువకుడి జీవితం క్రమశిక్షణతో నిండి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా శిక్షణ పొందిన వ్యక్తి సైన్యం, దేశం పట్ల అతని సంకల్పం తగ్గదు’ అని తెలిపారు.
భారత్ కూడా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని షెకావత్ ఈ సందర్భంగా వెల్లడించారు. “రెండు-మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాం. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వేగంగా పురోగమిస్తున్నాం. మనం కూడా $10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారతామని నేను నమ్ముతున్నాను. అదే జరిగితే, నీటి కొరతను తీర్చడానికి మేం కృషి చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
అత్యధికంగా భూగర్భ జలాలను వెలికితీసే దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర మంత్రి అన్నారు. ‘‘అమెరికా, చైనాలు కలిసి వెలికితీసే భూగర్భ జలాలు భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ. భారత్ తన అవసరాలను తీర్చుకునేందుకు 65 శాతం భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది. ప్రతి గ్రామసభల్లో భూగర్భ జలాల లభ్యతను అంచనా వేసేందుకు సన్నాహాలు చేశాం. ఇది భవిష్యత్తులో భూగర్భ జలాలను పునరుజ్జీవింపజేయడంలో మాకు సహాయపడుతుంది” అని తెలిపారు.
#WhatIndiaThinksToday. #TV9GlobalSummit pic.twitter.com/luLcrOdr8X
— News9 (@News9Tweets) June 17, 2022
రాజస్థాన్‌కు షెకావత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. పార్టీ చెప్పినట్లు చేస్తానని చెప్పుకొచ్చారు. ‘నేను 22 ఏళ్లుగా సరిహద్దు ప్రాంతాల్లో పనిచేశాను. పార్టీ చెప్పినట్లే నడుచుకోవాలని నా గురువు నన్ను కోరడంతోనే.. 2014లో రాజకీయాల్లోకి వచ్చాను. దీని ద్వారానే ప్రజలకు సేవ చేయాలని నన్ను కోరారు. అదేపని చేస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.