పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ సాధించే అవకాశాలే ఎక్కువ, తేల్చేసిన పబ్లిక్‌ ఓపినియన్‌ సర్వేలు

పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీని అధికారంలోంచి దింపేసి తాము గద్దెనెక్కాలనే గట్టి పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ అందుకు తగిన వ్యూహాలన్నీ పన్నుతోంది..

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ సాధించే అవకాశాలే ఎక్కువ, తేల్చేసిన పబ్లిక్‌ ఓపినియన్‌ సర్వేలు
Follow us

|

Updated on: Feb 18, 2021 | 3:27 PM

పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీని అధికారంలోంచి దింపేసి తాము గద్దెనెక్కాలనే గట్టి పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ అందుకు తగిన వ్యూహాలన్నీ పన్నుతోంది.. గట్టిగానే కసరత్తులు చేస్తోంది. పార్టీకి గ్లామర్‌ అద్దడం కోసం పెద్ద తెర, బుల్లితెర నటీనటులను కండువా వేసి మరీ లాగేసుకుంటోంది.. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్న పేరొందిన నాయకులకు కూడా ఎర వేస్తోంది.. ఇప్పటికే కొందరు గడ్డిపూలను కాదనుకుని కమలంలోకి చేరిపోయారు.. ఇంత చేస్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం లోకి రావడం మాత్రం ఒకింత కష్టమేనంటున్నాయి సర్వేలు.. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బెంగాల్‌లో ప్రధాన పోటీ మాత్రం తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే సాగుతుంది… కాంగ్రెస్‌- వామపక్షాల కూటమి కోల్పోయిన తమ పరువు ప్రతిష్టలను తిరిగి సంపాదించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అసలు బెంగాల్‌లో బీజేపీ ఇంతలా విస్తరిస్తుందని ఎవరూ ఊహించలేదు.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 లోక్‌సభ స్థానాలను గెల్చుకుని మమతా బెనర్జీని ఉలిక్కిపడేలా చేసింది బీజేపీ.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జోరును కనబర్చాలని పరుగులు పెడుతోంది.. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలను తనవైపుకు తిప్పుకుంది బీజేపీ.. పార్టీలో కీలక నాయకుడైన సువేందు అధికారి బీజేపీలో చేరడం ఆశ్చర్యకరమైన పరిణామం.. ఈయనకు జంగల్‌మహాల్‌, నందిగ్రాం వంటి ప్రాంతాలలో గట్టి పట్టుంది.. సువేందు అధికారి పార్టీని వీడటం ఓ రకంగా తృణమూల్‌కు పెద్ద దెబ్బే! ఈయనే కాదు కొందరు కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మమతా బెనర్జీని కాదనుకుని కమలం పార్టీలో చేరుతున్నారు.. ఎంతమంది వెళ్లినా తనకేం ఫరక్‌పడదన్న ధీమాతో మమతా బెనర్జీ ఉన్నారు.. ప్రజల మద్దతు ఉన్నంత కాలం తన విజయానికి ఢోకా లేదని భావిస్తున్నారు. అబ్బే.. ఈసారి ప్రజల మద్దతు తమకే దక్కుతుందని బీజేపీ అంటోంది.. తృణమూల్‌ కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని ఢంకా బజాయిస్తోంది.. ఇందుకోసమే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బెంగాల్‌పై ఎక్కువ కాన్‌సెంట్రేట్‌ చేస్తున్నారు..

అయితే సర్వేలు మాత్రం మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమంటున్నాయి.. తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి తీరుతుందని అంటున్నాయి. సీఎన్‌ఎక్స్‌, ఏబీపీ ఆనంద (ప్రైవేటు సంస్థలు) నిర్వహించిన పబ్లిక్‌ ఒపినియన్‌‌ సర్వేలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 146 నుంచి 156 స్థానాల్లో గెలుస్తుందని, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని తేల్చేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుందని, కమలం పార్టీకి 113-121 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. . మేజిక్‌ ఫిగర్‌ 148 స్థానాలకు అటు ఇటుగా తృణమూల్‌ గెలిచినా పెద్దగా ఇబ్బంది ఉండదని, ఎందుకంటే కాంగ్రెస్‌-వామపక్షాల నేతృత్వంలోని కూటమి సపోర్ట్‌తో మమతా అధికారంలో రావచ్చని పబ్లిక్‌ ఓపినియన్‌ సర్వేలు అంటున్నాయి.. కాంగ్రెస్‌- వామపక్షాల కూటమికి 20-28 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చాయి. చూద్దాం ఏమవుతుందో…!

మరిన్ని చదవండి ఇక్కడ :

CM KCR Rare And Old Photos: అలుపెరుగని యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరుదైన మధురస్మృతులు.

Man rapes dog in Mysuru act caught on camera Video: వీడు మనిషేనా ? వీధి కుక్కపై లైంగిక దాడి.