Ayodhya Ram Mandir: భక్తులకు విన్నపం.. ఇక నుంచి అలాంటివి పంపవద్దన్న అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు...

Ayodhya Ram Mandir: భక్తులకు విన్నపం.. ఇక నుంచి అలాంటివి పంపవద్దన్న అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2021 | 2:50 PM

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.1600 కోట్ల వరకు విరాళాలు అందినట్లు సమాచారం. రామ మందిరం నిర్మాణం అంటే పేదలు కూడా కనీసం రూ.10 నుంచి కూడా విరాళం ఇవ్వవచ్చని అయోధ్య ట్రస్ట్‌ తెలిపింది. అందుకు రూ.10 నుంచి వెయ్యి వరకు రశీదులను సైతం ముద్రించారు. మందిర నిర్మాణం సందర్భంగా దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. అయితే విరాళాలతో పాటు చాలా మంది డబ్బులతో పాటు భక్తితో మరింత విలువైనవి కూడా పంపుతున్నారు. అలా పంపుతున్న వాటిలో వెండి ఇటుకలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌ సహా చాలా నగరాలు,పట్టణాల నుంచి భక్తులు శ్రీరామునిపై భక్తితో వెండి ఇటుకలను తయారు చేయించి పంపుతున్నారు. అయితే ఇకపై వెండి ఇటుకలు పంపడం ఆపాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నిర్వాహకులు కోరుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వెండి ఇటుకలు వచ్చాయి. సుమారు 400 టన్నుల వెండి ఇటుకలు రావడంతో వాటన్నింటిని బ్యాంకు లాకర్లలో పెట్టారు. బ్యాంకు లాకర్లు కూడా ఖాళీ లేకపోవడంతో ఇలాంటివి పంపవద్దని ట్రస్ట్‌ కోరుతోంది.

దేశ వ్యాప్తంగా చాలా చోట్ల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెండి ఇటుకలను పంపుతున్నారు. పెద్ద మొత్తంలో వెండి ఇటుకలు రావడంతో వాటిని ఎలా భద్రపర్చాలనే విషయం ఇప్పుడు ట్రస్ట్‌ వారికి ప్రశ్నార్థకంగా మారింది. లాకర్లన్నీ పూర్తిగా వెండి ఇటుకలతో నిండిపోయాయి. రాముని మీద అందరికీ భక్తి ఉంది. సెంటిమెంట్‌ను గౌరవిస్తాం. కానీ దయచేసి మా విన్నపాన్ని మన్నించండి. వెండి ఇటుకలు మాత్రం పంపవద్దు. వెండి ఇటుకలను భద్రపర్చడానికి మేము ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది అని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ విజ్ఞప్తి చేస్తోంది. ఒక వేళ భవిష్యత్తులో వెండి అవసరం అయితే ఇప్పుడు మళ్లీ తాము భక్తులకు విజ్ఞప్తి చేస్తాం.. అని ట్రస్ట్‌ చెబుతోంది.

కాగా, రామ మందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా 1,50,000 గ్రూపులు నిధులను పేకరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రజల నుంచి ఆలయ నిర్మాణం కోసం చందాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.1600 కోట్ల నిధులు సమకూరినట్లు తెలుస్తోంది. ఇక మందిర నిర్మాణం 39 నెలల్లో పూర్తి చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: Srinagar Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ దేవాలయం.. భక్తుల ప్రత్యేక పూజలు