Srinagar Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ దేవాలయం.. భక్తుల ప్రత్యేక పూజలు

Srinagar Temple:  జమ్మూలోని శ్రీనగర్‌లో ఉన్న హిందూ దేవాలయం 31 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. 80లలో మిలిటెన్సీ, ఘర్షణల కారణంగా ఆలయం మూతపడింది. అక్కడ ...

Srinagar Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ దేవాలయం.. భక్తుల ప్రత్యేక పూజలు
Follow us

|

Updated on: Feb 18, 2021 | 2:33 PM

Srinagar Temple:  జమ్మూలోని శ్రీనగర్‌లో ఉన్న హిందూ దేవాలయం 31 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. 80లలో మిలిటెన్సీ, ఘర్షణల కారణంగా ఆలయం మూతపడింది. అక్కడ హిందువులపై దాడులు జరిగాయి. కశ్మీరీ పండిట్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూతపడిపోయింది. అయితే ఇప్పుడు కశ్మీర్ లో పరిస్థితులు సద్దుమణిగిపోయాయి. దీంతో శ్రీనగర్‌లోని హబ్బా కదల్ ప్రాంతంలోని శీతల్‌నాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు తరలి రావడంతో ఆలయం తిరిగి తెరుచుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఆలయంలో వేద మంత్రలు వినిపించాయి.

ఈ ఆలయాన్ని తిరిగి తెరువడానికి స్థానిక ప్రజల నుంచి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచి చాలా మద్దతు ఉన్నదని ఆలయానికి వచ్చిన భక్తుడు సంతోష్ రజ్దాన్ తెలిపారు. గతంలో ప్రజలు ఇక్కడ పూజలు చేయడానికి వచ్చేవారని, అయితే ఉగ్రవాదం కారణంగా ఈ ఆలయం మూసివేసినట్లు చెప్పారు. ఇక్కడి ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు మాకు ఎంతో సహాయం చేశారని, ఈ ఆలయం తిరిగి తెరిచేందుకు ముస్లిం సమాజం మాకు అవసరమైన సహాయం అందించిందని శీతల్‌నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న రవీందర్ రాజ్‌దాన్ అన్నారు. ఇక్కడి ముస్లింలు ఆలయాన్ని శుభ్రం చేయడానికి ముందుకు రావడమే కాకుండా.. పూజకు కావాల్సిన వస్తువులను కూడా తీసుకువచ్చారని తెలిపారు. ఏటా వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపేవారు. బాబా శీతల్నాథ్ భైరవ్ జన్మదినం వసంత పంచమి నాడే వస్తుండటం విశేషం.

తగ్గిన ఉగ్రవాద సంఘటనలు

2019 ఆగస్టు 5 న ఆర్టికల్-370 ను రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద హింస, రాళ్ళతో కొట్టే సంఘటనలు గణనీయంగా తగ్గిపోయాయి. 2019 లో 157 మంది ఉగ్రవాదులను నిరోధించినట్లు ఫిబ్రవరి 8 న కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభకు తెలిపారు. ఈ సంఖ్య 2020 లో 221 కు పెరిగింది. 2019 లో 594 ఉగ్రవాద హింస కేసులు నమోదవగా.. ఈ సంఖ్య 2020 లో 244కు తగ్గాయి. అయతే 2020 లో 327 రాళ్ళు రువ్విన సంఘటనలు నమోదయ్యాయి.

1987 తరువాత లోయలో ఉగ్రవాదం వ్యాప్తి

కశ్మీర్‌లో వివాదాస్పదమైన 1987 ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఉగ్రవాద సంఘటనలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు లభించింది. ఇది లోయలో హిందూ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించింది. కశ్మీరీ పండితులు ఇండ్లను విడిచి పారిపోవలసి వచ్చింది. ఒక అంచనా ప్రకారం, లోయలో 50 వేల దేవాలయాలు మూసివేతకు గురయ్యాయి. 2019 లో కేంద్ర ప్రభుత్వం వాటిని తిరిగి తెరిచినట్లు ప్రకటించింది.

Exchange of torn currency : చిరిగిన కరెన్సీనోట్ల మార్పిడి ఇప్పుడు బహు సులభం, ఈ సేవలకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్