Exchange of torn currency : చిరిగిన కరెన్సీనోట్ల మార్పిడి ఇప్పుడు బహు సులభం, ఈ సేవలకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు

డబ్బు.. కరెన్సీ నోట్లు లేనిదే పూడగడవని పరిస్థితి. ప్రమాదవశాత్తూనో, మరోరకంగానో అప్పుడప్పుడూ చెల్లని నోట్లు జనం దగ్గర తిష్టవేస్తాయి. అయితే, వీటిని కొత్త నోట్లలోకి..

Exchange of torn currency : చిరిగిన కరెన్సీనోట్ల మార్పిడి ఇప్పుడు బహు సులభం, ఈ సేవలకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు
Follow us

|

Updated on: Feb 18, 2021 | 2:29 PM

డబ్బు.. కరెన్సీ నోట్లు లేనిదే పూడగడవని పరిస్థితి. ప్రమాదవశాత్తూనో, మరోరకంగానో అప్పుడప్పుడూ చెల్లని నోట్లు జనం దగ్గర తిష్టవేస్తాయి. అయితే, వీటిని కొత్త నోట్లలోకి మార్చుకోవడం బహు సులభం. నేరుగా బ్యాంకులకు వెళ్లి పాడైన నోట్ల స్థానంలో కొత్తనోట్లు తీసుకోవచ్చు. ఈ సేవలకు బ్యాంకులు ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు సైతం ఈ సేవలు అందించాల్సి ఉంటుంది. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాలో రూ .5 లక్షలు విలువ చేసే కరెన్సీ నోట్లు చెదపురుగుల బారినపడి దెబ్బతిన్న నేపథ్యంలో నగదు మార్పిడి అంశం ఒక్కసారిగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే.

సాధారణంగా, సీనియర్ సిటిజన్లు తమ నగదును తమ ఇళ్లలో రహస్య ప్రదేశాల్లో దాచుకునే అలవాటు కలిగి ఉంటారు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, దెబ్బతిన్న నోటును మార్పిడి చేయడానికి బ్యాంకును సంప్రదించే ముందు, అది మట్టితో లేదా మ్యుటిలేట్ చేయబడిందా అని తనిఖీ చేసుకోవాలి. దాదాపుగా అన్ని బ్యాంకులు సాధారణ పరిస్థితుల్లో పాడైన కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త నోట్లు ఇస్తాయి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం రిజర్వ్ బ్యాంక్ లోని ప్రత్యేక కౌంటర్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఏమైనా కాని, నగదు కట్టలు పాడైనా పరేషాన్ కావాల్సిన అవసరం లేదు.

Read also : కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?