Snowfall in Deserts : ప్రపంచం త్వరలో అంతంకాబోతుంది.. సాక్ష్యం ఇదిగో అంటున్న కొంతమంది.. శాస్త్రజ్ఞుల వాదన ఏమిటంటే..!
ప్రపంచంలో రోజు రోజుకీ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయున్నాయని.. ఓ వైపు కరోనా, ఎబోలా, స్టెయిన్ వంటి అనేక వైరస్ లు వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు, వరదలు, మంచు తుఫాన్లతో ప్రకృతి విలయం..
Snowfall in Deserts : ప్రపంచంలో రోజు రోజుకీ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి.. ఓ వైపు కరోనా, ఎబోలా, స్టెయిన్ వంటి అనేక వైరస్ లు వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు, వరదలు, మంచు తుఫాన్లతో ప్రకృతి విలయం సృష్టిస్తోందని .. కుప్పలు తెప్పలుగా ,మరణాలు చోటు చేసుకుంటున్నాయని దీంతో ప్రపంచం అంతరించిపోతుందని కొంతమంది కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు.
ఇందుకు ముందస్తు హెచ్చరిక ఈ ఘటన అంటూ ఓ వీడియో చూపిస్తున్నారు. సౌదీ అరేబియాలోని అసిర్ ప్రావిన్స్‌లో 50 సంవత్సరాలలో మొదటిసారి మంచు కురిసింది. విపరీతంగా మంచు కురుస్తుంటే అక్కడ ఉన్న ఒంటెలు ఆ మంచువర్షంలోనే తడిచి ముద్దయ్యాయి.ఇక్కడ వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. బయటకు వస్తే చెమటలు పట్టే ఈ దేశంలో మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు నమోదవుతూ అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఈ విషయం పై గల్ఫ్ అధికారులు స్పందిస్తూ.. తమ దేశంలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో మంచు కురవలేదని చెప్పారు. అల్గేరియాలోని ఎయిన్ సెఫ్రీ నగరంలో కూడా విపరీతమైన స్థాయిలో మంచు కురిసింది. ఈ ప్రాంతాన్ని గెట్ వే టూ సహారా ఎడారి అని పిలుస్తారు. ఈ రెండు ఉదాహరణలనే పేర్కొంటూ ప్రపంచం అంతం కాబోతోందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
Hey climate deniers —
it’s snowing now in Saudi Arabia… pic.twitter.com/KxEQzIVHnY
— Rex Chapman?? (@RexChapman) February 18, 2021
అయితే ఈ విషయంపై శాస్త్రజ్ఞులు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. భారతదేశంలో ఢిల్లీలో 119 సంవత్సరాలలో అతి శీతల వాతావరణాన్ని చూసింది, స్పెయిన్ 1971 తర్వాత అత్యంత ఘోరమైన మంచు తుఫాను చవిచూసింది. ఇవన్నీ మానవుల తప్పిదానికి కలిగిన వాతావరణ మార్పులే అని చెప్పారు. వాతావరణంలో కార్బన్ స్థాయి పెరిగేకొద్దీ, ఇది వేడిగా, చల్లగా ఉండే పరిష్టితులకు దారితీస్తుందని చెప్పారు.
Also Read: