Covid Vaccine: మాకొద్దు బాబూ కోవిడ్ 19 వ్యాక్సిన్లు, తిరస్కరిస్తున్న అమెరికా సైనికులు, దిక్కు తోచని అధికారులు
Covid Vaccine: అమెరికా సైనికుల్లో మూడింట ఒకవంతుమంది కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దేశంలో..ముఖ్యంగా సైన్యంలో కోవిడ్ కేసులు అత్యధికం..
Covid Vaccine: అమెరికా సైనికుల్లో మూడింట ఒకవంతుమంది కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దేశంలో..ముఖ్యంగా సైన్యంలో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్నప్పటికీ వీరు మాత్రం తమకు ఈ టీకామందులు వద్దని అంటున్నారట.. పెంటగన్ అధికారి మేజర్ జనరల్ జెఫ్ టాలియా ఫెరో స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఇవి తీసుకోవడాన్నిఆప్ష నల్ గా మాత్రమే యూఎస్ డిఫెన్స్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోందన్నారు. కానీ ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తమకు ఇంకా పూర్తి ఆమోదం అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 9 లక్షల పదహారున్నర మంది సైనికులు వ్యాక్సిన్లు తీసుకున్నారని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికన్ జనాభాలో సైతం మూడింట ఒకవంతు మంది వ్యాక్సిన్లను తిరస్కరిస్తున్నారన్నారు.
నిజానికి సైన్యం తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవాలి.. కానీ ఎమర్జెన్సీ ప్రాతిపదికపైనే దీని వినియోగానికి ఆమోదం లభించినందున సైన్యంపై ఒత్తిడి తేజాలమని కిర్బీ చెప్పారు.