Buddhadeb Bhattacharjee: పద్మభూషణ్‌ను స్వీకరణకు మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ నిరాకరణ.. ఎందుకో తెలుసా?
బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్‌ను స్వీకరించడానికి నిరాకరించారు . తాను పద్మభూషణ్ అవార్డును స్వీకరించబోనని ఓ ప్రకటనలో తెలిపారు.
Buddhadeb Bhattacharjee refuses Padma Bhushan Award: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ(Buddhadeb Bhattacharjee)కు భారత విశిష్ట పురస్కారం పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. అయితే, ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్(Padma Bhushan Award)ను స్వీకరించడానికి నిరాకరించారు . తాను పద్మభూషణ్ అవార్డును స్వీకరించబోనని ఓ ప్రకటనలో తెలిపారు. పద్మభూషణ్ అవార్డు గురించి నాకేమీ తెలియదు. దీని గురించి ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే, తిరిగి ఇచ్చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం బుద్ధవ్ భట్టాచార్య CPIM జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు సీపీఎం, సీపీఐలకు చెందిన నేతలెవరూ ఇలాంటి అవార్డు తీసుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు భారతరత్న ఇవ్వాలని చర్చ జరిగింది, కానీ అతను కూడా నిరాకరించారు. అదే సమయంలో, ప్రభుత్వ వర్గాలు అతని ఎత్తుగడను రాజకీయ స్టంట్‌గా పేర్కొంటున్నాయి. ఆయనకు పద్మభూషణ్ అవార్డు గురించి కేంద్ర ప్రభుత్వ అధికారి ఉదయాన్నే అతని కుటుంబానికి తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అతని భార్య అధికారిని కలిశారు. అవార్డు తిరస్కరణకు సంబంధించి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాయంత్రమే అవార్డులను ప్రకటించారు.
Com. Buddhadeb Bhattacharya who was nominated for the Padma Bhushan award has declined to accept it. The CPI(M) policy has been consistent in declining such awards from the State. Our work is for the people not for awards. Com EMS who was earlier offered an award had declined it. pic.twitter.com/fTmkkzeABl
— CPI (M) (@cpimspeak) January 25, 2022
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో 128 మంది పేర్లను పద్మ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి బుద్ధవ్ భట్టాచార్య పద్మభూషణ్, విక్టర్ బెనర్జీ పద్మభూషణ్, ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్ పద్మశ్రీ, సంఘమిత్ర బందోపాధ్యాయ పద్మశ్రీ, కాజీ సింగ్ పద్మశ్రీ, కాలిపాద సోరెన్ పద్మశ్రీలకు ఎంపికయ్యారు.
బుద్ధదేవ్ భట్టాచార్జీతో పాటు, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను పద్మభూషణ్, మాజీ హోం కార్యదర్శి రాజ్ రాజీవ్ మెహ్రిషి పద్మభూషణ్‌తో సత్కరించనున్నారు. వీరితో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఇదిలావుంటే, పద్మ అవార్డులు.. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. ‘పద్మ విభూషణ్’ అసాధారణమైన, విశిష్టమైన సేవకు ప్రదానం చేయడం జరగుతుంది. ‘పద్మభూషణ్’ హై ఆర్డర్ విశిష్ట సేవకు, ‘పద్మశ్రీ’ అయా రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు.