Supreme Court: సర్కార్ ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం, కేంద్రానికి నోటీసులు
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే కీలక రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.
Supreme Court freebies: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే కీలక రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల(Political Parties) హామీలపై కీలక వ్యాఖ్యలు చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు(Suprme Court). ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.
ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలు(Freebies) తీవ్రమైన సమస్య అని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. దీన్ని ఎలా కట్టడిచేస్తారో సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘం, కేంద్రానికి నోటీసులు జారీచేసింది అపెక్స్ కోర్టు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ, దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ ఈ కామెంట్స్ చేశారు. ఈ ఇష్యూను చట్టబద్ధంగా ఎలా నియంత్రించాలో తెలుసుకోవాలనుకుంటున్నాను అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.
ఈ ఎన్నికల్లోగా ఇది సాధ్యమవుతుందా? అని సీజేఐ ప్రశ్నించారు. ఉచితాల బడ్జెట్ సాధారణ బడ్జెట్‌ను మించిపోయిందని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు సీజేఐ. రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ, ఈసీ ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందని చెప్పారాయన. ఎన్నికలకు ముందు ఉచిత పథకాలతో మభ్యపెట్టే పార్టీల గుర్తులను సీజ్ చేసేలా, పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకు సంబంధించి ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది అపెక్స్ కోర్టు. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. అయితే, సుప్రీం కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీశాయి.
Read Also… Republic Day: గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏమిటి..? పూర్తి వివరాలు..!