Fake ED Raid Video: గ్యాంగ్‌ మువీ సీన్‌ దింపారయ్యో.. గోల్డ్ జ్యువెల్లరీ షాపు పై నకిలీ ఈడీ దాడులు.. వీడియో చూశారా?

గ్యాంగ్ మువీలో హీరో సూర్య టీంలో ఓ లేడీతో కూడిన నకిలీ ఇన్‌కామ్‌ట్యాక్స్‌ టీం వరుస ధనవంతుల ఇళ్లల్లో వరుస దాడులు చేసి కోట్ల రూపాయలు దోచుకునే సీన్ చూసేందుకు బలేగా ఉంటుంది. కానీ ఓ దొంగముఠా ఏకంగా రియల్ లైఫ్ లో దీనిని వాడేశాడు. కానీ తృటిలో పోలీసులకు చిక్కిపోయారు..

Fake ED Raid Video: గ్యాంగ్‌ మువీ సీన్‌ దింపారయ్యో.. గోల్డ్ జ్యువెల్లరీ షాపు పై నకిలీ ఈడీ దాడులు.. వీడియో చూశారా?
Fake ED Raid
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 10, 2024 | 6:44 PM

అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 10: హీరో సూర్య ‘గ్యాంగ్‌’ మువీ చూశారా? ఈ మువీలో సూర్య గ్యాంగ్‌ నకిలీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ అధికారుల పేరిట దాడులు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటారు. సేమ్‌ టు సేమ్‌ సీన్‌ను.. ఈ దొంగల ముఠా కూడా దించేసింది. వాళ్ల ముఖాల్లో కాన్ఫిడెన్స్‌ చూస్తే అసలు అధికారులకు కూడా దడ పుడుతుంది. పర్ఫామెన్స్‌ అలాంటిది మరి. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వీరు రైడ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకెళ్తే..

గుజరాత్‌లోని కచ్‌లో డిసెంబర్‌ 2న గాంధీధామ్‌లోని రాధిక జ్యువెలర్స్ యాజమానికి చెందిన షాపుతోపాటు అతని ఇంటిపై నకిలీ ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 12 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులమంటూ దాడులు చేశారు. ఈడీ అధికారిగా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చి ఐడీ కార్డు చూపించాడు. అకౌంట్ల వివరాలు చెప్పాలని, లేదంటే జైలుకు పంపాల్సి వస్తుందని బెదిరించడం వీడియోలో కనిపిస్తుంది. వ్యాపారవేత్త కూడా భయాందోళనలో ఉన్నట్లు వీడియోలో కనిపిస్తాడు. బ్యాంకు వివరాలు, బంగారం, నగదు వివరాలు చెప్పేందుకు 15 నిమిషాల సమయం ఇచ్చాడు. చివరకు ఆ ముఠా సభ్యులు రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు.

ఇవి కూడా చదవండి

గాంధీధామ్‌లో ఉన్న రాధిక జ్యువెలర్స్ షాపుతోపాటు, అతని నివాసాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో ఈ దాడులు చేశారు. ఈ ఘటనపై గాంధీధామ్ డివిజన్-ఎ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దొంగల రాకెట్‌ను ఛేదించారు. 12 మంది సభ్యులున్న నకిలీ ఈడీ ముఠాను అరెస్ట్‌ చేశారు. తాళ్లతో వారి చేతులు కట్టి వీధుల్లో ఊరేగించారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. నిందితుల నుంచి రూ.45 లక్షల విలువైన నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈడీ అధికారిగా నటించిన శైలేంద్ర దేశాయ్ ఫేక్ రైడ్‌కు అసలు సూత్రధారిగా పోలీస్‌ అధికారి తెలిపారు. ఎస్పీ సాగర్ బాగ్మార్ మాట్లాడుతూ ఫిర్యాదు అందుకున్న వెంటనే గాంధీ ధామ్‌లోని పోలీసులుగాంధీ ధామ్, భుజ్ , అహ్మదాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో 10 బృందాలుగా గాలించి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా కార్యకలాపాలు, ఇతర నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను తాళ్లతో కట్టి రోడ్డుపై నడిపించి తీసుకెళ్తున్న వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.