AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils Interview 2024: తెలుగోళ్ల సత్తా.. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూకి 90 మందికిపైగా అర్హత! పూర్తి లిస్ట్ ఇదే

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 90కి పైగా అభ్యర్ధులు తదుపరి దశ ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి జాబితా ఈ కింద ఉంది..

UPSC Civils Interview 2024: తెలుగోళ్ల సత్తా.. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూకి 90 మందికిపైగా అర్హత! పూర్తి లిస్ట్ ఇదే
UPSC Civils Interview
Srilakshmi C
|

Updated on: Dec 10, 2024 | 5:15 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్ 10: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్‌ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను డిసెంబర్‌ 9న సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదికి మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్స్‌ నిర్వహించగా తాజాగా ఫలితాలు వెల్లడించారు. యూపీఎస్సీ పరీక్షలు మొత్తం మూడు దశల్లో జరుగుతాయి.

ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు పూర్తవగా త్వరలోనే ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో సత్తా చాటిన అభ్యర్థులను ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర (గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి) సర్వీసులకు ఎంపిక చేస్తారు. అయితే మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా DAF-II ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూరించాల్సి ఉంటుంది.13 డిసెంబర్ 13 నుంచి 19వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే DAF-II అప్లికేషన్‌ అందుబాటులో ఉంటుంది.

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 పరీక్షకి దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 13.4 లక్షలు. వీరిలో 14,627 మంది మాత్రమే మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. ఇప్పుడు వీరిలో 2,800 మంది తుది దశ ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలక్షన్‌ లిస్ట్ వెలువడుతుంది. ఇంటర్వ్యూ తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంటర్వ్యూకి ఎంపికైన 2,800లో ఏకంగా 90 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్రతిభ చూపి ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. గతేడాది ఏప్రిల్‌ 16న వెల్లడైన ‘సివిల్స్‌-2023’ తుది ఫలితాల్లో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 60 మంది వివిధ సర్వీసులకు ఎంపికవడం గమనార్హం. వారిలో నలుగురు ఏకంగా 100లోపు ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అనన్య రెడ్డికి మూడో ర్యాంకు సాధించారు. ఎంతో కఠినమైన ఈ సివిల్‌ సర్వీస్ పరీక్షలకు తెలుగు వారు యేటా అధిక సంఖ్యలో ఎంపిక కావడం గర్వకారణం.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూకి ఎంపికైన జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!