AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శక్తిమాన్‌ మాదిరి బైక్‌ స్టంట్‌.. పోలీసులు సీదా అతడని ఎక్కడికి తీసుకెళ్లారో తెల్సా..?

వికాస్‌ అనే వ్యక్తి శక్తిమాన్‌ తరహాలో బైక్‌పై పడుకొని ఈ స్టంట్‌ చేశాడు. ఆ వీడియో అతడిని చిక్కుల్లోకి నెట్టింది. ఆ వివరాలు మీ కోసం...

Viral: శక్తిమాన్‌ మాదిరి బైక్‌ స్టంట్‌.. పోలీసులు సీదా అతడని ఎక్కడికి తీసుకెళ్లారో తెల్సా..?
Bike Stunt
Ram Naramaneni
|

Updated on: May 28, 2022 | 9:02 PM

Share

శక్తిమాన్‌(Shaktimaan)లా కలగన్నాడు. గాల్లో తేలిపోవాలని ఉవ్విళ్లూరాడు. తనను తాను ఓ హీరోగా ఊహించుకున్నాడు. లైక్స్, షేర్స్ కోసం ఆరాటపడ్డాడు. ఫేమస్ అవ్వాలని పిచ్చి ప్రయత్నం చేశాడు. రీల్‌ యాక్షన్స్‌ను రియల్‌గా ప్రాక్టీస్‌ చేసిన ఓ యువకుడి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నోయిడా(Noida)కు చెందిన వికాస్‌కు స్టంట్స్‌ చేయడమంటే మహా సరదా. 1990లో ఫేమస్‌.. సూపర్‌హీరో శక్తిమాన్‌ అంటే పిచ్చి. అచ్చం శక్తిమాన్‌లా స్టంట్స్‌ వేయాలని కలలుగంటున్నాడు. వీలు దొరికినప్పుడల్లా ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే బైక్‌పై నిలువెల్లా పడుకొని ఓ స్టంట్‌ చేశాడు వికాస్‌.ఇప్పుడీ స్టంటే చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రమాదకర స్టంట్‌ చేసిన వికాస్‌తో పాటు వీడియో రికార్డ్‌ చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నోయిడా పోలీసులు. వికాస్‌ బైక్‌ను సీజ్‌ చేశారు. గౌతమ్‌ బుద్ధానగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Gautam Buddh Nagar commissionerate) ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇతను మాత్రమే కాదు..  కొద్దిరోజుల క్రితం నొయిడాకే చెందిన రాజీవ్‌ అనే వ్యక్తి… అజయ్‌ దేవ్‌గణ్‌ స్టైల్లో కారు స్టంట్‌ చేయడంతో.. పోలీసులు అతడ్ని కూడా లోపలేశారు. పోలీసులు రెండు ఎస్‌యూవీ కార్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అతని స్టంట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో.. అలెర్టెయిన పోలీసులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి స్టంట్స్‌ను యూత్ ఫాలో అవ్వొద్దని… ప్రాణాలకే రిస్క్ అని.. పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us