IPO Investing Tips: ఐపీవోలో పెట్టుబడి పెట్టే సమయంలో రిటైల్ ఇన్వేస్టర్లు చేయకూడని తప్పులు ఇవే.. నష్టపోతారు జాగ్రత్త..

IPO Investing Tips: ఇటీవలి కాలంలో దేశంలో ఐపీఓ మార్కెట్‌ జోష్ మీద ఉంది. 2021లో దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల క్యాపిటల్ ను కంపెనీలు IPOల ద్వారా సేకరించాయి.

IPO Investing Tips: ఐపీవోలో పెట్టుబడి పెట్టే సమయంలో రిటైల్ ఇన్వేస్టర్లు చేయకూడని తప్పులు ఇవే.. నష్టపోతారు జాగ్రత్త..
Ipo
Follow us

|

Updated on: May 28, 2022 | 8:40 PM

IPO Investing Tips: ఇటీవలి కాలంలో దేశంలో ఐపీఓ మార్కెట్‌ జోష్ మీద ఉంది. 2021లో దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల క్యాపిటల్ ను కంపెనీలు IPOల ద్వారా సేకరించాయి. ఇది 2018- 2020 మధ్య సేకరించిన మొత్తం రూ. 73,000 కోట్ల కంటే ఎక్కువనే చెప్పుకోవాలి. టెక్ స్టార్టప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు, SMEలు మొదలైనవి వీటిలో అగ్రగామిగా ఉన్నాయి. బుల్లిష్ IPO మార్కెట్ కూడా స్టాక్ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తిని పునరుద్ధరించాయి. అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులతో పాటు, మొదటిసారి ఐపీవోలో పార్టిసిపోటే చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో వీటిలో పాల్గొంటున్నారు. పెరుగుతున్న డిజిటలైజేషన్, ఫిన్‌టెక్ స్పేస్ రూపాంతరం చెందడం కూడా వృద్ధిని వేగవంతం చేస్తున్నాయి. కానీ చాలా మంది IPO నుంచి స్థిరమైన రాబడిని పొందాలంటే మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి భద్రతపై రాజీ పడకుండా, పొరపాట్లు చేయకుండా మంచి రాబడిని పొందేందుకు ఈ సూత్రూలు తప్పక పరిగణలోకి తీసుకోవాలి.

  1. తొందరపడకండి, ప్రాథమిక పరిశోధనను సరిగ్గా చేయండి. మంచి IPOని గుర్తించడానికి కంపెనీపై లోతైన పరిశోధన చేయడం చాలా అవసరం. పరిశోధన పరిధి గత ట్రాక్ రికార్డ్, ఫైనాన్సియల్ హెల్త్, పరిశ్రమ విశ్లేషణ, పోటీతత్వం మొదలైనవాటికి మాత్రమే పరిమితం కాకుండా ఉండాలి. వివేకం కలిగిన పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్తును, దాని వృద్ధి ప్రణాళికను కూడా పరిశీలించాలి.
  2. బిజినెస్ మోడల్ తెలియకుండా పెట్టుబడి పెట్టకండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న సంస్థ వ్యాపార నమూనా తెలియకుండా కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు. స్థాపించబడిన, కొత్త వెంచర్.. రెండింటికీ బలమైన వ్యాపార నమూనా అవసరం. కంపెనీ వ్యాపార నమూనా ఉత్పత్తులు (మరియు సేవలు), టార్గెట్ కస్టమర్స్, భవిష్యత్తు అవకాశాల గురించి అవగాహన కలిగి ఉండాలి. వ్యాపార నమూనా గురించి ఒక ఆలోచన కలిగి ఉండటం వలన భవిష్యత్తులో వ్యాపారం లాభాన్ని పొందగలదా లేదా అని విశ్లేషించడానికి ఇన్వెస్టర్లకు సహాయపడుతుంది.
  3. IPO వాల్యుయేషన్‌ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో, షేర్ మార్కెట్ ట్రెండ్‌లు, గత ఆర్థిక పరిస్థితులు, అదే పరిశ్రమలో వ్యాపారం చేస్తున్న ఇతర కంపెనీలకు సంబంధించిన పనితీరు మొదలైన వాటి సహాయంతో వాల్యుయేషన్ అంచనా వేయటం జరుగుతుంది. IPO అధిక వాల్యుయేషన్, డిమాండ్ మిగిలిన వాటిని గుర్తించాలి. రిటైల్ పెట్టుబడిదారులు కూడా IPO వాల్యుయేషన్ మాత్రమే ప్రమాణం కాదని గుర్తుంచుకోవాలి. గతంలో అనేక కేసులు ఉన్నాయి. ప్రారంభంలో అధిక వాల్యుయేషన్లు ఉన్నప్పటికీ, ఆ తర్వాత విలువలు పడిపోయాయి.
  4. క్షీణిస్తున్న మార్కెట్‌లో పెద్ద సాహసాలు చేయకండి. నియమం ప్రకారం.. క్షీణిస్తున్న మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. మార్కెట్ బేరిష్‌గా ఉంటే, విశ్లేషకులు & ఇతర పరిశ్రమ నిపుణులు క్షీణత కొనసాగుతుందని విశ్వసిస్తే IPOలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. IPO సమీప భవిష్యత్తులో గొప్ప రాబడిని ఇవ్వని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. లిస్టింగ్ రోజున అమ్మడానికి తొందరపడకండి. సాధారణంగా IPO లిస్టింగ్ రోజున ఎలాటైన షేర్లను అమ్మటం థంబ్ రూల్ ఏంటంటే ఇది గొప్ప రాబడిని ఇస్తుంది. అయితే.. లిస్టింగ్ రోజున రద్దీ కారణంగా ధరలు కరెక్షన్ అవుతాయి. అందువల్ల లిస్టింగ్ రోజునే విక్రయించడం కంటే ఒకటి లేదా రెండు రోజులు వేచి ఉండటం ఉత్తమం.